Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
- ఉక్రెయిన్ యుద్ధంలో నార్త్ కొరియా ఆర్మీ..
- రష్యాకు మద్దతుగా కిమ్ సైన్యం..
- ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లోకి ఉత్తర కొరియా సైనికులు ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా తరుపున పోరాడటానికి కిమ్ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తమపై పోరాటంలో 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించడానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం చెప్పారు. ఉత్తర కొరియా రష్యాకి తన సైనికులను పంపిందని జెలన్ స్కీ గతంలో కూడా ఆరోపించారు. అయితే, మొదటిసారి ఎంత మంది సైనికులను పంపించారనే విషయంపై వివరాలు వెల్లడించారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
నార్త్ కొరియా సైనికులు ఆక్రమిత ఉక్రెయిన్‌లో ఉన్నారని, మా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నాయకులతో బ్రస్సెల్స్ వేదికగా జరిగిన చర్చలో ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యాకు వ్యతిరేకంగా మద్దతు కోసం జెలన్ స్కీ ఈయూ నాయకుల సమావేశానికి ముందు నాటో మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఉత్తర కొరియా దళాల్లో ల్యాండ్ ఆర్మీ, వ్యూహాత్మక సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
ఇది ప్రపంచయుద్ధానికి మొదటి అడుగుగా జెలెన్ స్కీ హెచ్చరించాడు. ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులను రష్యాకు అందిస్తోందని ఆరోపించాడు. అయితే, ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. ఇదిలా ఉంటే జూన్ నెలలో పుతిన్, నార్త్ కొరియాలో పర్యటించాడు. ఆ సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌తో పలు ఒప్పందాలపై సంతకం చేశారు. ఇందులో పరస్పర రక్షణ ఒప్పందం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి రష్యా, ఉత్తర కొరియా మిత్రదేశాలుగా ఉన్నాయి. 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరింత దగ్గరయ్యాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు