Fake Bomb Threats: దేశంలో గత 10 రోజులుగా విమానయాన రంగాన్ని నకిలీ బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. 10 రోజుల్లో 250కి పైగా విమానాలు బెదిరింపులుకు గురయ్యాయి. డొమెస్టిన్‌తో సహా ఇంటర్నేషనల్ రూట్లలో నడిచే విమానాలపై ప్రభావం పడింది. ఈ నకిలీ బెదిరింపుల ఫలితంగా విమానయాన రంగం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చాలా వరకు ఈ నకిలీ బెదిరింపులు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలోని గుల్మార్గ్, గందర్బల్ జిల్లాలోని గగాంగీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు. Read Also: Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ హోటళ్లకు వరస […]
Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ నగరంలోని పలు హోటళ్లకు వరసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటల్లకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రసిద్ధ హోటళ్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా నగరం అంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన పెంచాయి.
Delhi: ఢిల్లీలో యమునా నది కాలుష్యానికి కేరాఫ్‌గా మారింది. విషపూరిత నురగ యమునా నదిలో ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే యమునాలో ఎలాంటి కాలుష్యం ఉందో, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా చేసిన ప్రయత్నం.. ఆయనను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.
Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఈ రోజు వైమానిక దాడులు చేసింది. నిర్ధిష్ట లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అక్టోబర్ 01న ఇరాన్, ఇజ్రాయిల్‌పై 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. అయితే, ఈ దాడిని సిరియా, సౌదీ అరేబియా […]
CRIME: ఢిల్లీకి చెందిన గర్భిణీ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమె లవర్. హర్యానలోని రోహ్తక్లో ఆమె ప్రియుడు, మరో ఇద్దరు కలిసి హత్య చేసి పూడ్చిపెట్టారు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ప్రియుడు ఒత్తిడి తెచ్చినప్పటికీ యువతి వినలేదు. దీంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడు.
Waqf bill: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకువచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో మరోసారి సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాగైనా వక్ఫ్ అమలుని నిలిపేస్తామని, దాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు’’ అని అన్నారు. కాన్పూర్‌లో జరిగిన […]
Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాస్ లీకేజ్ కారణంగా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. త్తర చెన్నైలోని తిరువొత్తియూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన అనేక మంది విద్యార్థులు బుధవారం రోజు, అనుమానాస్పద గ్యాస్ లీక్ కారనంగా శ్వాస తీసుకోవడం, తల తిరగడం, వికారం వంటి లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారు.
Viral Video: ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఓలా ఇటీవల కాలంలో పలు విమర్శలు ఎదుర్కొంటోంది. సర్వీస్ కరెక్ట్‌గా లేదని కస్టమర్లు ఫైర్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఓలా స్కూటర్లలో మంటలు చెలరేగడం కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తోంది.తాజాగా బెంగళూర్‌లో ఓలా స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. బెంగళూరులోని జయదేవ్ హాస్పిటల్ సమీపంలోని బీటీఎం లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Selfie With Elephant: ఒక యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాలను తీసింది. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో 23 ఏళ్ల వ్యక్తి ఏనుగుతో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.