Viral Video: ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఓలా ఇటీవల కాలంలో పలు విమర్శలు ఎదుర్కొంటోంది. సర్వీస్ కరెక్ట్‌గా లేదని కస్టమర్లు ఫైర్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఓలా స్కూటర్లలో మంటలు చెలరేగడం కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తోంది.తాజాగా బెంగళూర్‌లో ఓలా స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. బెంగళూరులోని జయదేవ్ హాస్పిటల్ సమీపంలోని బీటీఎం లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Also: Selfie With Elephant: ఏనుగుతో సెల్ఫీ ప్రయత్నం.. వ్యక్తిని తొక్కి చంపేసింది..
బెంగళూర్‌లోని ఓలా షోరూం ముందే ఈ ఘటన జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. కొందరు దీపావళి ముందుగా వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌ని ‘‘స్కామ్‌స్టర్’’ అని విమర్శిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఒక నెటిజన్ ఓలా దీపావళి కోసం సిద్ధమవుతోందా..? అని ప్రశ్నించారు. మరొరకు ‘ఓలా కార్పొరేట్ దీపావళి పార్టీ’ అని కామెంట్ చేశారు.
ఓలా తన వినియోగదారులకు నాసిరకం సేవలు అందిస్తోందనే ఆరోపణలు వినిపిస్తుున్నాయి. అయితే, నిన్న 99.1 శాతం మంతి తమ కస్టమర్ల సమస్యల్ని సంతృప్తికరంగా పరిష్కరించినట్లు ప్రకటించింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలాపై వచ్చిన వేల కొద్ది ఫిర్యాదులపై అక్టోబర్ 07న షోకాజ్ నోటీసులు పంపింది. దీని తర్వాత ఓలా నుంచి ప్రకటన వచ్చింది.