మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి నుంచి పోటీ చేస్తుండగా, ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీకి దిగాడు. యుగేంద్ర పవార్ ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం నుంచి పోటీ చేస్తున్నాడు.
Sanjay Kumar Verma: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత సంబంధాల్లో తీవ్రమైన దౌత్యవివాదానికి కారణమైంది. అయితే, ఈ హత్యలో భారత సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందని సాక్ష్యాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలతో భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. మన దౌత్యవేత్తలు ఆరుగురిని రీకాల్ చేసింది. మనదేశంలోని కెనడా దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ పీజీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. కోల్‌కతాలో డాక్టర్ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారణ జరుపుతోంది. నిందితుడు సంజయ్ రాయ్, డాక్టర్ సెమినార్ హాల్లో నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొడుకు తన స్నేహితులతో కలిసి తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహిళ మృతదేహం లభించింది. దీనిపై విచారించిన పోలీసులు.. సొంత కొడుకే హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. డీజే మిక్సర్ రిపేర్ కోసం డబ్బులు అడిగితే, తల్లి నిరాకరించడంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. కొడుకు, అతడి ఫ్రెండ్స్‌ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..?
Bomb Threats To Flights: గత 10 రోజలుగా భారత విమానయాన రంగాన్ని నకిలీ బాంబు కాల్స్, మెసేజులు కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల ప్రయాణికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం కూడా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోలకు చెందిన 60 విమానాలకు, ఆకాసా ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
BJP: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రియాంకాగాంధీ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. నామినేషన్ వేస్తున్న సమయంలో మల్లికార్జున ఖర్గేని అనుమతించలేదని, గేటు వద్దే ఉంచారని చూపిస్తున్న వీడియో వైరల్‌పై బీజేపీ స్పందించింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ వార్ ప్రారంభమైనప్పటికీ నుంచి పలువురు జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, ఆరుగురు ‘అల్ జజీరా’ జర్నలిస్టులకు పాలస్తీనా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది.
Turkey Terror Attack: టర్కీ రాజధాని అంకారాలో భారీ ఉగ్రదాడి జరిగింది. టర్కీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై బుధవారం ఘోరమైన దాడి జరిగింది. తుపాకులు, బాంబులతో దాడి చేశారు. ‘‘అంకారాలోని కహ్రామంకజాన్‌లోని TUSAS సౌకర్యాలపై తీవ్రవాద దాడి జరిగింది. దురదృష్టవశాత్తు, మాకు చనిపోయిన వారు మరియు గాయపడిన వ్యక్తులు ఉన్నారు” అని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 10 మంది కన్నా ఎక్కువ ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. Read […]
Maharashtra Elections: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు ముగిసినట్లే కనిపిస్తోంది. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి.