Delhi: ఢిల్లీలో యమునా నది కాలుష్యానికి కేరాఫ్‌గా మారింది. విషపూరిత నురగ యమునా నదిలో ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే యమునాలో ఎలాంటి కాలుష్యం ఉందో, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా చేసిన ప్రయత్నం.. ఆయనను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. యుమునా నదిలో స్నానం చేసిన రోజు తర్వాత ఆయన స్కిల్ అలర్జీకి గురయ్యారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చర్మంపై దద్దర్లు, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాడు.
Read Also: Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..
గురువారం రోజు దేశ రాజధానిలోని యమునా నదిలో సచ్‌దేవా స్నానం చేశారు. 2025 నాటికి యమునాని శుభ్రం చేస్తానని గతంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, దానిని నేర్చలేదని ఆరోపిస్తూ, సచ్‌దేవా యమునలోని కాలుష్యాన్ని తెలిపేందుకు అందులో స్నానం చేసి ఆస్పత్రి పాలయ్యారు. యుమనా నది శుద్ధికి ఉద్దేశించిన నిధులని ఆప్ ప్రభుత్వం కాజేసిందని, కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సచ్‌దేవాకి ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల పాటు మెడిసిన్స్ రాశారు. 2025 ఛత్ పూజకు ముందు దానిని శుభ్రం చేస్తానని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యమునా నది కాలుష్యం వేదికగా బీజేపీ, ఆప్ విమర్శలు చేసుకుంటున్నాయి.