India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది.
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు.
Odisha: ఒడిశాలో గర్భంతో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సెలవు నిరాకరించడంతో కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రపరా జిల్లాలో తన కార్యాలయంలో తీవ్ర ప్రసవవేదన అనుభవించిన మహిళ పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీఓ) సెలవు నిరాకరించడంతో తాను బిడ్డను కోల్పోయినట్లు బర్షా ప్రియదర్శిని అనే 26 ఏళ్ల మహిళ మీడియాకు చెప్పడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Election Commission: ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ సంచలన విషయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను గెలుచుకుని మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి కాంగ్రెస్ 37 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.
Bomb threats: విమానయాన సంస్థలకు బూటకపు బెదిరింపులు తప్పట్లేదు. దాదాపుగా రెండు వారాలుగా దేశంలోని అన్ని ఎయిర్లైనర్లకు నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా 32 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 400కి పైగా విమానాలు బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. ఈ కాల్స్ నేపథ్యంలో కేంద్రం ఏజెన్సీలు అత్యున్నత దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. Read Also: Triumph: ఇండియాలో […]
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా […]
India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్‌కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంతా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.
Crime: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణాల జిల్లాలోని హస్నాబాద్‌లో వైద్యం కోసం వచ్చి మహిళా పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారం చేశాడు. యాంగ్జైటీ, టెన్షన్ పరిస్థితుల్లో మాససిక ప్రశాంతత కోసం ఇచ్చే ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానిక ఒడిగట్టాడు. ఈ కేసులో సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Tejas MK1A: స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించే అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్ తేజస్ కోసం F404-IN20 ఇంజిన్లను అందించడంలో విఫలమైంది. నిజానికి జీఈ 2023లోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనల సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి.