స్పెయిన్ పీఎం పెడ్రో శాంచెజ్ సోమవారం ఆయన భార్య బెగోనా గోమెజ్ తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారతదేశంలోని ఆన్లైన్ లావాదేవీల పురోగతిని స్పెయిన్ పీఎం దగ్గరుండి పరిశీలించారు. మంగళవారం యూపీఐ చెల్లింపు విధానాన్ని ఉపయోగించి, గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్యాలెస్ ‘‘విప్లవ మ్యూజియం’’గా మారుతుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సోమవారం తెలిపారు. హసీనాకు చెందిన విలాసవంతమైన ప్యాలెస్ నుంచి ఆమె పారిపోయేలా చేసిన విప్లవానికి గుర్తుగా ఈ మ్యూజియం మారుతుందని యూనస్ చెప్పారు. ఈ మ్యూజియంలో ఆమె దుర్మార్గమైన పరిపాలన, ఆమెను అధికారం నుంచి తొలగించిన ప్రజలు విప్లవాన్ని భద్రపరుస్తుందని చెప్పారు.
Panipuri: ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. క్యాబేజీ మంచూరియాలో కృత్రిమ రంగులు, రసాయనాలు వాడటాన్ని ఇప్పటికే నిషేధించింది. తాజాగా చాలా మంది ఫేవరెట్ అయిన ‘‘పానీపూరీ’’ని నిషేధించే దిశగా కర్ణాటక వెళ్తోంది.
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఎన్డీయేలో ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ‘‘మహాగట్బంధన్’’లో మళ్లీ చేరబోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అన్నారు.
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ దెబ్బ పడింది. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థి, తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పాడు. శివసేన-యూటీటీ నుంచి ఔరంగాబాద్‌లో పోటీ చేయడానికి టికెట్ పొందిన అభ్యర్థి కిషన్ చంద్ తన్వానీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు.
China: చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి యువత వివాహాలు చేసుకోవడానికి, పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. వరసగా రెండో ఏడాది కూడా ఆ దేశంలో శిశు జననాలు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశం పిల్లలు కనడాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Actor Vijay: తమిళనాడులో యాక్టర్ విజయ్ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన తొలి రాష్ట్రస్థాయి సభకు దాదాపుగా 8 లక్షల మంది ప్రజలు తరలి రావడం చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా విజయ్‌పై ఇటు అధికార డీఎంకే, అటు ప్రతిపక్ష ఏఐడీఎంకే రెండూ కూడా విమర్శలు మొదలుపెట్టాయి. తాజాగా, విజయ్ తమ ఐడియాలజీని కాపీ కొట్టారని డీఎంకే అధికార ప్రతినిధి […]
Akali Dal: పంజాబ్‌లో వరస ఓటములతో ఢీలా పడిన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి ఊరట విజయం దక్కింది. ఈ పార్టీకి చెందిన అభ్యర్థి హర్జిందర్ సింగ్ ధామీ సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SGPC) అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి తిరిగి ఎన్నికయ్యారు.
DMK: తమిళ స్టార్ దళపతి విజయ్ ఆదివారం విల్లుపురంతో తన పార్టీ తమిళగ వెట్రి కజగం(వీటీకే) తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి లక్షల్లో జనాలు హాజరయ్యారు, సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇదిలా ఉంటే,