HIV cases: ఉత్తరాఖండ్‌లో హెచ్ఐవీ కేసుల పెరుగుదల కలకలం రేపుతోంది. రాంనగర్లో హెచ్ఐవీ కేసులు సంఖ్య హఠాత్తుగా పెరిగింది. దీనిపై అక్కడి ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 19 నుంచి 20 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది స్థానికంగా ఆరోగ్య శాఖలో హెచ్చరికల్ని పెంచింది.
Digital Arrest Scam: ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్స్ దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. సాక్ష్యాత్తు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ అరెస్ట్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈడీ, ఐటీ, పోలీసు డిపార్ట్మెంట్కి చెందిన అధికారుల తీరు ఫోజు కొడుతూ, అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు పోటీ పడుతున్నాయి.
Free Bus: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పథకాల్లో మహిళలకు ‘‘ఫ్రీబస్’’ సదుపాయం ఒకటి. ప్రభుత్వం ఇప్పుడు ఈ ‘‘శక్తి’’ పథకాన్ని కొనసాగించడంపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు […]
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత ఆరాధనీయమైన కృష్ణజింకల్ని వేటాడిని కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సల్మాన్ ఖాన్‌కి అత్యంత సన్నిహితుడు, ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిక్‌ని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ టార్గెట్‌గా పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Air India: పీక్ ట్రావెల్ పిరియడ్‌లో ఎయిర్ ఇండియా అమెరికాకు 60 విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. నిర్వాహణ సమస్యల కారణంగా, ఎయిర్ క్రాఫ్ట్‌లు అందుబాటులోని కారణంగా ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మద్య భారత్ – అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్‌కి చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోతో పాటు అమెరికాలోని వివిధ నగరాలకు సర్వీసులు రద్దు అయ్యాయి. భారీ నిర్వహణ, సప్లై చైన్ పరిమితుల నుంచి కొన్ని […]
Crime: రాజస్థాన్‌లో రెండు రోజలు క్రితం అదృశ్యమైన 50 ఏళ్ల బ్యూటీషియన్ శరీర భాగాలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో కనిపించాయి. మహిళను ఆమెకు తెలిసిన వ్యక్తి హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఆరు ముక్కలు చేసిన నిందితుడు, ఇంటి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28న బాధితురాలు అనితా చౌదరి మధ్యాహ్నం తన బ్యూటీ పార్లర్ మూసేసిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె భర్త మన్మోహన్ చౌదరి జోధ్‌పైర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
Nepal: నేపాల్ తన కరెన్సీ నోట్లపై భారత భూభాగాలను ముద్రించడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ కరెన్సీని చైనా ముద్రించడం గమనార్హం. భారతదేశ భూభాగాలైన లింపియాధుర, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలను తమ భాగాలుగా నేపాల్ చూపించుకునే ప్రయత్నం చేసింది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్త 100 రూపాలయ నోట్లపై భారత భూభాగాలను ముద్రించింది. ఈ కాంట్రాక్టును చైనా కంపెనీకి ఇచ్చింది. Read Also: KA Movie Review: […]