Karnataka: ఆడియో-వీడియోలతో మాజీ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేసిన కాంగ్రెస్ నాయకురాలు..
- మాజీ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేసిన కాంగ్రెస్ మహిళా నేత..
- పథకం ప్రకారం ఆడియో..వీడియో రికార్డింగ్స్..
- రూ. 20 లక్షల ఇవ్వాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.
బ్లాక్‌మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మంజులా పాటిల్, ఆమె భర్త శివరాజ్ పాటిల్‌ని అరెస్ట్ చేసింది. ఈ జంట కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌ని బ్లాక్‌మెయిల్ చేశారు. చాలా ఏళ్లుగా సదరు మహిళ మంజుల, గుత్తేదార్‌తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన పదవిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా వీరి మధ్య సాగుతున్న మాటల్ని, వీడియో కాల్స్‌ని మంజుల రికార్డ్ చేసింది. మంజులకు సంబంధించిన ఫోన్లో ఇతర వ్యక్తులకు చెందిన వివరాలు కూడా ఉన్నాయి. దీంతో దర్యాప్తు పరిధిని పెంచాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
Read Also: IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..
మంజుల, శివరాజ్ తమ అరెస్ట్‌కి రెండు రోజుల ముందు బెంగళూర్‌లో డబ్బుల కోసం గుత్తేదార్ కుమారుడు రితేష్‌ని సంప్రదించారు. రితేష్ అధికారిక ఫిర్యాదుతో పోలీసులు శనివారం గరుడా మాల్‌లో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపరిచి, 8 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
నలపాడ్ బ్రిగేడ్ అధ్యక్షురాలిగా ఉన్న మంజుల, గుత్తేదార్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని ఆయన కొడుకు రితేష్‌ని కలిసింది. మీడియాకు ఈ వివరాలు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షల్ని డిమాండ్ చేసింది. మంజుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు స్మార్ట్‌ఫోన్‌లలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు, పోలీసు అధికారి మరియు పీడబ్ల్యూడీ అధికారితో సహా కనీసం ఎనిమిది మంది వ్యక్తుల సెన్సిటివ్ వీడియోలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!