Bomb threats: విమానయాన సంస్థలకు బూటకపు బెదిరింపులు తప్పట్లేదు. దాదాపుగా రెండు వారాలుగా దేశంలోని అన్ని ఎయిర్‌లైనర్లకు నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా 32 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 400కి పైగా విమానాలు బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. ఈ కాల్స్ నేపథ్యంలో కేంద్రం ఏజెన్సీలు అత్యున్నత దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.
Read Also: Triumph: ఇండియాలో 2025 ట్రయంఫ్ టైగర్ 1200 రిలీజ్.. ధర, ఫీచర్లు ఇవే
అయితే, ఈ బూటకపు సందేశాల వల్ల కోట్ల రూపాలయ నష్టాన్ని ఎయిర్‌లైన్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘‘నో ఫ్లై’’ లిస్టులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బెదిరింపులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా వస్తుండటంతో కేంద్రం సదరు ప్లాట్‌ఫారమ్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. బాంబు బెదిరింపు సందేశాలనున తక్షణమే తొలగించాలని, ఆ బాధ్యత మీదే అని చెప్పింది.