PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన పండగ సందర్భంగా ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంక్షించారు.
Pappu Yadav: ఇటీవల కాలంలో బీహార్ పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ దేశవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతున్నాడు. ముంబైలో ఎన్సీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ని చంపిన తర్వాత, ప్రభుత్వం అనుమతి ఇస్తే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ని 24 గంటలో తుదిచిపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్కి ఫోన్ రావడంతో తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని వేడుకుంటున్నాడు.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Uddhav Thackeray: బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బావాన్కులే, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ ఠాక్రేని ఒత్తిడి చేసింది, తమతో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
West Bengal: వెస్ట్ బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా పలు మండపాలపై దాడులు జరిగాయి. దీనిపై కలకత్తా హైకోర్టు రాష్ట్ర డీజీపీ నుంచి నివేదిక కోరింది. వివిధ జిల్లాల్లో దుర్గాపూజ సందర్భంగా జరిగిన సంఘటనలు, వారు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు డీజీపీకి నివేదిక సమర్పించాలని జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్య నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ఆదేశించింది. డీజీపీ అన్ని నివేదికను పరిశీలించి, ఫైనల్ రిపోర్టుని హైకోర్టుకు సమర్పిస్తారు. […]
Maharshtra: దీపావళి అలంకరణ విషయంలో ముస్లిం వ్యక్తులు అభ్యంతరం తెలుపుతున్న వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. మహారాష్ట్ర నవీ ముంబైలోని పంచానంద్ సొసైటీలోని ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది.
Arvind Kejriwal: కాలుష్యం నుంచి ప్రజల్ని రక్షించేందుకు బాణాసంచాపై నిషేధం అవసరమని, ఇందులో హిందూ-ముస్లిం కోణం లేదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అన్నారు. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని కోరారు. ‘‘మనం ఇతరులకు ఏదైనా ఉపకారం చేస్తు్న్నామని కాదు, మనం మనకు మేలు చేసుకుంటున్నాము. ఎందుకంటే పటాసులు కాల్చడం వల్ల కాలుస్యంతో బాధపడుతాము’’ అని అన్నారు. Read Also: Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు.. […]
C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు శిక్షణ పొందుతున్న జిమ్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, అలహాబాద్ హైకోర్టు జోక్యంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.