Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
- పెరియార్ సిద్ధాంతాలకు దూరంగా విజయ్..
- దేవుడు లేడనే సిద్ధాంతాన్ని తాము నమ్మం..
- తమిళనాడులో ఎవరూ చేయని పని చేసిన దళపతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు. ఈ సభలో అధికార డీఎంకే పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకే కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని చెప్పారు. ఇదే విధంగా మతతత్వ రాజకీయాలు చేసే పార్టీలకు తాము వ్యతిరేకమని పరోక్షంగా బీజేపీ పేరు తీసుకువచ్చారు.
ఇదిలా ఉంటే, తమిళనాడులో రాజకీయాలు ముఖ్యంగా ద్రవిడవాదం, పెరియార్ సిద్ధాంతాల ఆధారంగా నడుస్తాయి. అయితే, విజయ్ మాత్రం పెరియార్ సిద్ధాంతాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రావిడ ఐకాన్‌గా భావించే పెరియార్ ‘‘దేవుళ్లను తిరస్కరించే సిద్ధాంతం’’ని తాము తీసుకోవడం లేదని, కానీ ఆయన చెప్పిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత అనే పెరియార్ చెప్పిన అంశాలను మాత్రం తీసుకుంటామని చెప్పారు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై చెప్పినట్లు ‘‘అందరూ ఒక్కరే, ఒక్కడే దేవుడు’’ అనేదే తమ భావజాలమని ప్రకటించాడు.
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
Read Also: NBK 109: సారీ.. పండక్కి అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నాం: నాగవంశీ
ఇలా పెరియార్ వైఖరి నుంచి విజయ్ తప్పుకోవడం సంచలనంగా మారింది. సాధారణంగా తమిళనాడు రాజకీయాలు అన్ని పెరియార్ చుట్టూ తిరుగుతుంటాయి. అలాంటిది ఆయన సిద్ధాంతాలకు విజయ్ దూరంగా ఉండటం ప్రధాన చర్చగా మారింది. పెరియార్ అతడి రాజకీయాలే తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేలకు పునాది. జస్టిస్ పార్టీ అధినేత పెరియార్ 1944లో దాని పేరును ద్రవిడర్ కజగంగా మార్చారు.1949లో అన్నాదురై పార్టీని విభజించి డీఎంకేను స్థాపించారు. ఆ తర్వాత 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు.
ప్రముఖ దేశాలయాలు ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మతపరమైన భావాలు పుంజుకుంటున్న తరుణంలో విజయ్ రాజకీయ అరంగ్రేటం జరిగింది. తమిళనాడులో మాజీ ఐఏఎస్ అన్నామలై ఆధ్వర్యంలో బీజేపీ అక్కడ జాతీయవాదాన్ని, హిందుత్వాన్ని తట్టిలేపుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలవకున్నా, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోగలిగింది. నిజానికి జోసెఫ్ విజయ్ క్రిష్టియన్, కానీ ఆ మతాన్ని పెద్దగా ఆచరించడం లేదు. ఆయన తల్లి, భార్య హిందూ ముదలియర్‌లు. ఈ సమీకరణం విజయ్‌కి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. దీనికి తోడు ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఇందుకు ఓ కారణం.
డిప్యూటీసీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతనాన్ని తుడిచిపెట్టాలి అని చేసిన వ్యాక్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అక్కడి హిందువుల్లో కూడా కాస్త వ్యతిరేఖత ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ మతాల విషయంలో న్యూట్రల్‌గా ఉంటడం కలిసి రావచ్చు. గతంలో ఉన్నంత బలంగా ఏఐడీఎంకే లేదు. బీజేపీ అన్నామలై నేతృత్వంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రాజకీయ శూన్యత అనేది విజయ్‌కి కలిసి రావచ్చు.
తాజావార్తలు
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!