Venu Goapl Reddy
Author- NTV Telugu-
West Bengal: ‘‘ అమ్మా.. నేను దొంగని కాదు, చిప్స్ దొంగిలించలేదు’’.. 12 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్..
West Bengal: పశ్చిమ బెంగాల్ మేదినీపూర్‌లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలపై బహిరంగంగా అవమానించబడటంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణించడానికి ముందు, తన ఇంట్లో తన తల్లికి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నేను చిప్స్ దొంగిలించలేదు’’ అని అందులో పేర్కొన్నాడు. ఇది చూస్తే, ఎంతలా ఆ పసి హృదయం బాధించబడిందో అర్థమవుతోంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు. -
IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్‌కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్‌కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్‌ని ఎదుర్కొంది. -
Pakistan: పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్స్ సపోర్ట్.. జిత్తులమారి చైనా మరో కుట్ర..
Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది. -
Snake-bite scam: ‘‘పాముకాటు కుంభకోణం’’.. 47 మందిని 280 సార్లు చంపారు..
Snake-bite scam: మధ్యప్రదేశ్ లో ‘‘పాము కాటు కుంభకోణం’’ వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే, ఏకంగా 280 సార్లు మరణించారని ప్రకటించారు. ప్రతీసారి రూ. 4 లక్షలను ప్రకృతి వైపరీత్య సహాయాన్ని పొందారు. ఫలితంగా మొత్తం రూ. 11 కోట్ల 26 లక్షల అవినీతి జరిగింది. రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడితో సహా 20 […] -
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేసు.. ఆమెకు స్పాన్సర్ చేసిన సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం..
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ దేశంలో సంచలనంగా మారింది. ఆమెకు పాకిస్తాన్‌పై ఉన్న ప్రేమ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించి ఆమె, పలువురు పాక్ ఏజెంట్లను కలుసుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు ఉన్న పరిచయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా, పాకిస్తాన్ తరుపున ఒక కథనాన్ని ప్రచారం చేయడానికి ఆమె తన వీడియోలను వాడుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. 33 ఏళ్ల యూట్యూబర్ ప్రస్తుతం హర్యానా… -
Pakistan Spies: యూపీలో పట్టుబడిన మరో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు..
Pakistan Spies: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో యూపీ యాంటీ-టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. -
Bangladesh: మహ్మద్ యూనస్‌కి ఆర్మీ చీఫ్ వార్నింగ్.. “రఖైన్ కారిడార్”పై విభేదాలు..
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మరోసారి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే, అక్కడి యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి పడటం లేదు. ఆర్మీ చీఫ్ హెచ్చరికల తర్వాత యూనస్ ప్రభుత్వం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి ‘‘మానవతా కారిడార్’’ని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచారు. విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఏకపక్షంగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత రఖైన్ కారిడార్ అంగీకరించిందని ప్రకటించారు. దీనిపై ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు చేయడంతో, ప్రభుత్వం యూ-టర్న్… -
Trump: ‘‘ట్రంప్ ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు’’.. అది ఆయన లక్షణం..
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు. -
Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ షాక్..
Satya Pal Malik: సుమారు రూ. 2200 కోట్ల విలువైన కిరు జల విద్యుత్ ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల మంజూరుకు సంబంధించి అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కి ఉచ్చు బిగిస్తోంది. సీబీఐ ఆయనపై గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కిష్ట్వార్లో కిరు జల విద్యుత్ ప్రాజెక్టు టెంటర్ల ప్రక్రియకలో జరిగిన అనుమానిత అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. -
India On Turkey: పాకిస్తాన్‌కి టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ కీలక సూచనలు..
India On Turkey: పాకిస్తాన్‌కి ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. టర్కీకి బలమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!