AI Adoption: కొత్త టెక్నాలజీని ప్రపంచంతో పోలిస్తే భారత్ అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఓ సర్వే ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) భారతదేశం అత్యంత త్వరగా స్వీకరించినట్లు వెల్లడించింది. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) పరిశోధన తెలియజేసింది. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోస్తున్నాయని తెలిపింది.
CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
Interesting News: తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
"Dog" Remark: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ చేసిన ‘‘కుక్క’’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ‘‘నిరాశ’’ చెందుతోందని అభివర్ణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి తీవ్ర నిరుత్సాహంతో ఉందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
Marco Rubio: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ కూర్పును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అనుకూల అమెరికన్లకు ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్జ్‌ని నియమించుకున్నారు.
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు. ‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ […]
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఆ దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముక్యంగా రాడికల్ లెఫ్ట్ లిబరల్స్‌పై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలోని విద్యా సంస్థల్లో రాడికల్ లెఫ్ట్ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు.
Baba Siddique Murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హత్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ హత్యలో ప్రధాన షూటర్ శివకుమార్‌ని ఆదివారం అరెస్ట్ చేశారు.
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీపై ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతతత్వ సంస్థ ‘‘జమాతే ఇస్లామీ’’ మద్దతుతో ఆమె వయనాడోలో పోటీ చేస్తుందని విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రియాంకా గాంధీ స్పందించారు.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) దాని అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ చెప్పే ‘‘పీడీపీ’’కి కొత్త అర్థాన్ని యోగి చెప్పారు. పీడీపీ అంటే వెనకబడిని, దళిత, అల్పా సంఖ్యాకులు కాదని ‘‘ప్రొడక్షన్ హౌజ్ ఆఫ్ దంగై, అపరాధి’’( అల్లర్లు, అపరాధాలు చేసే వ్యక్తుల ప్రొడక్షన్ హౌజ్)అని యోగి అన్నారు.