Marco Rubio: భారత మద్దతుదారుడే అమెరికా విదేశాంగ కార్యదర్శి.. ట్రంప్ కీలక ఎంపిక..!
- భారతీయ మద్దతుదారులకు ట్రంప్ పెద్దపీట..
- ఇప్పటికే ఎన్‌ఎస్ఏగా మైక్ వాల్ట్జ్ నియామకం..
- విదేశాంగ కార్యదర్శగా మార్కో రుబియో ఎంపిక..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marco Rubio: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ కూర్పును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అనుకూల అమెరికన్లకు ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్జ్‌ని నియమించుకున్నారు. యూఎస్ సెనెట్‌లో ఇండియా కాకస్ అధిపతిగా ఉన్నారు. ఇండియాకు గట్టి మద్దతుదారుగా వాల్ట్జ్‌కి పేరుంది. దేశ రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేస్తానని గతంలో చాలా సార్లు వాల్ట్జ్ పేర్కొన్నారు. ట్రంప్‌కి ఈయన లాయలిస్ట్‌గా ఉన్నారు. 2023లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్‌లో చారిత్రత్మక ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో మైక్ వాల్ట్జ్ కీలక పాత్ర పోషించారు. మైక్‌కి సైనికపరంగా చాలా అనుభవం ఉంది. ఫ్లోరిడా గార్డ్స్‌లో పనిచేయడానికి ముందు ఆయన నాలుగు ఏల్లు సైన్యంలో పనిచేశాడు. 50 ఏళ్ల వాల్ట్జ్ ఫ్లోరిడా నుంచి మూడు సార్లు అమెరికన్ కాంగ్రెస్‌కి ప్రాతినిధ్యం వహించారు.
Read Also: Mallu Ravi: బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ఇదిలా ఉంటే, ట్రంప్ మరోసారి భారతీయ అనుకూలుడైన సెనేటర్ మార్కో రూబియోని అత్యున్నత పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ సెక్రటరీ పదివికి రూబియోని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూబియోకి ఒక వేళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవి కట్టబెడితే అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రూబియో భారత్‌లో బంధాన్ని బలపరుచుకోవాలని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామిగా ఉంచడానికి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ప్రత్యేకించి యూఎస్-భారత్ సహకారంలో, రక్షణ, వాణిజ్య రంగాలలో మరింత పురోగతి ప్రోత్సహించే అవకాశం ఉంది.
రూబియో భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరడంతో పాటు చైనాను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) యొక్క మానవ హక్కుల ఉల్లంఘనలు, వాణిజ్య పద్ధతులు మరియు దక్షిణ చైనా సముద్రంలో దూకుడు చర్యలను విమర్శించారు. సాంకేతికత బదిలీలపై ఆంక్షలు మరియు పరిమితులతో సహా చైనాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే విధానాలకు ఆయన మద్దతు ఇచ్చారు.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో చర్చలకు పిలుపునిచ్చారు. నాటోకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ దేశాన్ని తమకు అత్యంత కీలకమైన మిత్రదేశంగా భావిస్తున్నాడు. హమాస్‌ని పూర్తిగా తుదముట్టించే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!