Priyank Kharge: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గతాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం హయాంలో అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని ఖర్గే గ్రామంపై రజాకార్లు దాడి చేసి, ఖర్గే ఇంటిని కాల్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఖర్గే తల్లితో పాటు ఆయన కుటుంబం కూడా మరణించారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెబుతూ.. తన కుటుంబ త్యాగాన్ని మరిచి ఖర్గే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
Alexei Zimin: రష్యన్ సెలిబ్రిటీ చెఫ్, పుతిన్‌ని విమర్శించే 52 ఏళ్ల అలెక్సీ జిమిన్ అనుమానాస్పద రీతిలో మరణించారు. సెర్బియాలో ఓ హోటల్ గదిలో శవంగా కనిపించాడు. 2014లో రష్యా ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను స్వాధీనం చేసుకోవడంపై జిమిన్ పుతిన్‌ని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
Eye Surgery: గ్రేటర్ నోయిడాలో ఓ వైద్యుడి నిర్లక్ష్యం బాలుడు కంటి చూపు కోల్పోయే పరిస్థితికి తీసుకువచ్చింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో 7 ఏళ్ల బాలుడి ఎడమ కంటికి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకెళ్లగా, డాక్టర్ కుడి కంటికి ఆపరేషన్ చేశారు. నవంబర్ 12న సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసింది.
Kanhaiya Kumar: మహరాష్ట్ర ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ‘‘మతాన్ని రక్షించే’’ బాధ్యత ప్రజలపై ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
H-1B visa: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని ప్రపంచం అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా H-1B పరిమితులు ప్రధాని నరేంద్రమోడీ ఆత్మనిర్బర్ భారత్ చొరవను ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది.
Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్‌ని ముంబైలో తమ దేశం తరుపున రాయబారిగా నియమించింది. ఆఫ్ఘాన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ని ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్‌లో యాక్టింగ్ కాన్సుల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లను భారత్ గుర్తించలేదు. తాజాగా తాలిబాన్లు భారత్‌లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్దే అవుతుంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య పాలన 2021లో ముగిసింది. అమెరికన్ దళాలు ఆఫ్ఘాన్‌ని వదిలేసిన తర్వాత అక్కడ అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నారు. తాలిబాన్ పాలనలో అక్కడ ప్రజల్లో పేదరికం పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. వారు బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా కుటుంబంలోని మగాళ్లు తోడు రావాల్సింది. బాలిక విద్యను నిషేధించారు. ముఖ్యంగా అక్కడ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు.