Bangladesh: బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని బలంగా కోరుతోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్ సాయాన్ని కోరింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ఆరోపణలు చేస్తోంది.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లాని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో దేశంలో జరిగిన కాల్పులకు సంబంధించి అర్ష్ దల్లాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కెనడాలో హత్య చేయబడిని ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి హర్ష్ దల్లా అత్యంత సన్నిహితుడు. భారత్ ఇతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కి పెద్ద తన నొప్పిగా మారింది.
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పలు సందర్భాల్లో ట్రంప్ చెప్పాడు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
PM Modi: రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు ఒక కులాన్ని మరో కులంపైకి కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలను విభజించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. జార్ఖండ్‌లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2016లో ఆయన సాధించిన ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలను అందుకున్నారు. ముఖ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయించి స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ సత్తా చాటాడు. ఏకంగా 7 స్వింగ్ రాష్ట్రాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాడు. తాజాగా అరిజోనాని కూడా ట్రంప్ తన ఖతాలో వేసుకోవడంతో మొత్తం స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించారు.
Ajit Pawar: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది.
Kiren Rijiju: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పూణేలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదని, విదేశాల్లో భారత్‌ని నిందించడం కారణంగా ఎవరూ నాయకులు కాలేరని హితవు పలికారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌లో అసలు గేమ్ ప్రారంభం కాబోతోంది. ట్రంప్ గెలిచిన వెంటనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తనను ప్రధానిగా పేర్కొంటూ శుభాకాంక్షలు చెప్పింది. ఈ పరిణామం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి క్లియర్ మేసేజ్‌గా చెప్పవచ్చు. నిజానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ట్రంప్‌కి గతం నుంచి గ్యాప్ ఉంది. ట్రంప్‌ని గట్టిగా విమర్శించే వ్యక్తుల్లో మహ్మద్ యూనస్ ఒకరు. మహ్మద్ యూనస్ ప్రస్తుతం […]