“Dog” Remark: ‘‘నిరాశ నుంచి నిరుత్సాహానికి’’.. కాంగ్రెస్ చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్ మహా చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యల కలకలం..
- నిరాశతో ఉన్నందుకే ఇలాంటి కామెంట్స్ అని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Dog” Remark: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ చేసిన ‘‘కుక్క’’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ‘‘నిరాశ’’ చెందుతోందని అభివర్ణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి తీవ్ర నిరుత్సాహంతో ఉందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.
‘‘వారు నిరాశ నుంచి నిరుత్సాహనికి’’ వెళ్తున్నారు. శరద్ పవార్ ఏదో మాట్లాడుతున్నాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల సంఘాన్ని తిడుతున్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ బీజేపీని కుక్క అని పిలుస్తోంది, ఎందుకంటే అన్ని సర్వేలు కూడా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారం చేపడుతుందని చెబుతున్నాయి, దీంతో వారంతా నిరాశలో ఉన్నారు, దీనిని మేము అర్థం చేసుకోగలమని సోమయ్య ఎద్దేవా చేశారు.
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
Read Also: CM Chandrababu: వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
సోమవారం అకోలాలో జరిగిన కాంగ్రెస్ ప్రచారంలో నానా పటోలే మాట్లాడుతూ.. ‘‘ మిమ్మల్ని కుక్కలని పిలిచే బీజేపీ వాళ్లకు అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా..? ఇప్పుడు బీజేపీని కుక్కగా మార్చే సమయం వచ్చింది. వారు చాలా అహంకారంతో ఉన్నారు’’అని బీజేపీని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అంతే ధీటుగా స్పందిస్తోంది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. నానా పటోలే నిరుత్సాహానికి గురయ్యారని, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని స్పష్టమైందని, అందుకే వారు నిరాశలో ఉన్నారని, అందుకు బీజేపీని కుక్కులు అంటూ తిడుతున్నారని, ఇది ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ మైండ్ సెట్‌ని తెలియజేస్తోందని దుయ్యబట్టారు. నానా పటోలే వాడిన పదాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్, కుమారస్వామిని ఉద్దేశిస్తూ ‘‘నలుపు’’ అనే పదాన్ని వాడాడని, ఇప్పుడు పటోలే కుక్క అనే పదాన్ని వాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!