Skoda Kylaq: స్కోడా ఆటో ఇండియా తొలిసారిగా తన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘‘కైలాక్’’ని నవంబర్ 5న విడుదల చేసింది. MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కైలాక్ కార్ నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై కుషాక్, స్లావియా రూపుదిద్దుకుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉన్న స్కోడా, ఇదే ఫీచర్లను కైలాక్‌లో కూడా అందించబోతోంది.
New Study: జ్ఞాపకశక్తి అనేది కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాకపోయి ఉండొచ్చని కీలక అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ యూనివర్శిటీ (NYU)లోని శాస్త్రవేత్తలు జ్ఞాపకశక్తి పనితీరు మెదడు కణాలకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సూచించే పరిశోధనను వెల్లడించారు. శరీరంలో మెదడు కణాలు కానీ చాలా ప్రాంతాల్లో కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటున్నట్లు కనుగొన్నారు.
Trump 2.0 Cabinet: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అతడి క్యాబినెట్ ఎలా ఉంటుందని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ట్రంప్ తన క్యాబినెట్లో ఇండియాకు గట్టి మద్దతుదారులుగా, చైనా వ్యతిరేకులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు భారత్-అమెరికా మధ్య ఆశాజనక సంబంధాలను సూచిస్తున్నాయి. మార్కో రుబియో – మైక్ వాల్ట్జ్: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా మైక్ వాల్ట్జ్‌ని ఎంపిక చేయడం, విదేశాంగ మంత్రిగా […]
Bulldozer Action: బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజీలో ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘బుల్డోజర్ న్యాయం’’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. బుల్డోజర్ జస్టిస్‌కి కేరాఫ్‌గా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకుపడ్డారు. నవంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని 9 నియోజకవర్గాల్లోని సిసామావు నుంచి ఆయన ప్రసంగించారు.
Modi-Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీ పాదాలను తాకబోయారు. బీహార్ దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. 73 ఏళ్ల నితీష్ కుమార్, 74 ఏళ్ల ప్రధాని మోడీ వైపు కదులుతూ.. పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.
Marco rubio: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత, ఆయన కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టారు. తాజాగా భారత్‌కి గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్ట్జ్‌ని జాతీయభద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమించారు. ఇదే విధంగా మరో వ్యక్తి, భారత్‌తో సన్నిహితంగా ఉంటే మార్కో రుబియోని అత్యంత కీలమైన ‘‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’’గా నిమించారు. అయితే, ఈ నియామకాలు ఇండియాకు చాలా కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత […]
Death: ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని అమెరికాకు చెందిన ఒక నర్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన వివరాలు వైరల్‌గా మారాయి. ఇంటెన్సివ్ కేర్(ఐసీయూ)లో చాలా అనుభవం కలిగిన ఆమె చెప్పిన వివరాలు సంచలనంగా మారాయి.
Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షని విజయవంతంగా నిర్వహించారు. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని, ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Starlink: భారతదేశంలో ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ ‘‘స్టార్‌లింక్’’ సేవలు త్వరలో ఇండియాలో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఒక వేళ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలోకి వస్తే ముఖేస్ అంబానీ జియో, సునీల్ భారతి మిట్టల్ ఎయిర్‌లెట్ వంటి సంస్థలు జాగ్రత్త పడాల్సిందే.
Naveen Ramgoolam: మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్గూలం విజయం సాధించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అభినందించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన విశిష్టమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అతనితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.