Crime: విద్య నేర్పిస్తారని నమ్మి వచ్చిన విద్యార్థిని చెరబట్టారు ఇద్దరు టీచర్లు. నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కాన్పూర్ వెళ్లిన ఓ మైనర్‌పై నగరంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఉపాధ్యాయులు నెలల తరబడి అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ప్రస్తుతం భారతీయులకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు.
USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆ దేశంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్రంప్ ప్రధాన హమీల్లో ఒకటైన వలసదారుల్ని, శరణార్ధుల్ని దేశంలో నుంచి తొలగించడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వలసదారుల కోసం ప్రారంభించిన ‘‘డెబిట్ కార్డ్ ప్రోగ్రామ్’’ లేదా ‘‘వోచర్ ప్రోగ్రాం’’ని న్యూయార్క్ సిటీ ముగింపు పలికింది.
Trump Effect: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు హమాస్ ఉగ్రవాదం సంస్థలకు మద్దతుగా వ్యవహరిస్తూ, హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్న ఖతార్ తన వైఖరిని మార్చుకుంది. దోహాలో నివసిస్తున్న హమాస్ లీడర్లను బహిష్కరించేందుకు ఖతార్ అంగీకరించింది. అమెరికా నుంచి నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది.
High Court: క్రూరత్వానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. తన చనిపోయిన భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి అభియోగాలు ఎదుర్కొన్నాడు.
Canada Student Visa: కెనడా వెళ్లి చదువుకోవాలనుకోవడం భారతీయ విద్యార్థుల్లో చాలా మందికి ఉంటుంది. ఇన్నాళ్లు ఆ దేశ ప్రభుత్వం కూడా భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీమ్‌ని నిలిపేసింది. కెనడా ప్రస్తుతం హౌసింగ్ సంక్షోభంతో పాటు వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇబ్బడిముబ్బడిగా ఆ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని అక్కడి […]
Bengaluru: బెంగళూర్‌లో ఓ జంట తమ అపార్ట్మెంట్లోని బాల్కనీలోనే గంజాయి సాగు మొదలుపెట్టారు. సిక్కింకి చెందిన ఈ జంటన బెంగళూర్‌లో తాము నివాసం ఉంటున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. సిక్కింకి చెందిన కె. సాగర్ గురుంగ్ (37), అతని భార్య ఊర్మిళ కుమారి (38) తమ బాల్కనీలోని రెండు కుండాల్లో అలంకార మొక్కలతో పాటు గంజాయిని నాటారు.
Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది.
DK Shivakumar: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూర్‌లో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.