Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్యలో ప్రధాన షూటర్ అరెస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం..
- బాబా సిద్ధిక్ హత్యలో ప్రధాన షూటర్ అరెస్ట్..
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు..
- నేపాల్ పారిపోయే క్రమంలో చిక్కిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Siddique Murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హత్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ హత్యలో ప్రధాన షూటర్ శివకుమార్‌ని ఆదివారం అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో పట్టుబడ్డాడు. సిద్ధిక్‌ని చంపిన తర్వాత నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), ముంబై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు.
Read Also: Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
బాబా సిద్ధిక్‌ని చంపేందుకు నిందితుడు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించాడు. ముంబై బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్టోబర్ 12న కాల్పులు జరిగాయి. మొత్తం 6 రౌండ్ల కాల్పుల్లో అతను మరణించాడు. ఈ కేసులో అప్పటి నుంచి శివకుమార్ పరారీలోనే ఉన్నాడు. తాజాగా ఇతడితో పాటు ఇతడికి ఆశ్రయం కల్పించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో మెంబర్ అని అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న శుభమ్ లోంకర్ అన్మోల్ బిష్ణోయ్‌తో పరిచయాన్ని సులభతరం చేశారని శివకుమార్ పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖ్‌పై కాల్పులు జరపడానికి ముందు అతని షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని ముంబై పోలీసులు గతంలో చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!