BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.
Ban jokes on Sikhs: సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి జోకులను ప్రదర్శించే వెబ్సైట్లను నిషేధించాలే ఆదేశాలు ఇవ్వానలి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ‘‘ఇది చాలా ముఖ్యమైన విషయం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది.
Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్‌తో పాటు అతని సహచరులపై అదనపు చార్జ్ షీట్ ఖరారు కావడంతో రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది. చార్జ్ షీట్‌ని ఈ రోజు కోర్టులో దాఖలు చేయనున్నారు. 1000 పేజీల చార్జి షీట్, బలమైన సాంకేతిక, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కలిగి ఉంది. ఇది కేసును మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.
Mumbai 26/11 attack: 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది, పాకిస్తాన్ కెనడియన్ అయిన తహవ్వూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. భారత్‌కి తనను అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం తలుపుతట్టాడు.
DK Shivakumar: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేది ఎవరో రేపటితో తేలబోతోంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Pakistan: పాకిస్తాన్‌ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు.
Gautam Adani: గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని అభియోగాలు ఎదుర్కొంటోంది.
Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెన్యా దేశంతో అదానీ గ్రూపుతో చేసుకున్న భారీ ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా రాజధాని నైరోబిలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై నియంత్రణను అదానీ గ్రూపుకు అప్పగించాలని భావించిన సేకరణ ప్రక్రియను రద్దు చేయాలని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం ఆదేశించారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో ఏకంగా 65.1 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. 1995 ఎన్నికల్లో 71.5 శాతం నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. దశాబ్ధం తర్వాత ఇంతలా ఓటింగ్ శాతం పెరగడం ఇదే తొలిసారి. Read Also: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి 2004, 2014 ఎన్నికల్లో 63.4 […]