Mumbai 26/11 attack: 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది, పాకిస్తాన్ కెనడియన్ అయిన తహవ్వూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. భారత్‌కి తనను అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం తలుపుతట్టాడు. కింది కోర్టులు రాణాని భారత్‌కి అప్పగించాలని తీర్పు చెప్పాయి. ముంబై ఉగ్రదాడిలో రాణా ప్రమేయం ఉందని, అతడిని తమకు అప్పటించాలని భారత్ అమెరికాని కోరింది. దిగువ కోర్టులు మరియు అనేక ఫెడరల్ కోర్టులలో జరిగిన న్యాయ పోరాటంలో ఓడిపోయిన తర్వాత రానా చివరిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చేరుకున్నాడు.
Read Also: Maharashtra Elections 2024: మహాయుతి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం..
సెప్టెంబర్ 23న, రాణానికి భారత్‌కి అప్పగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయంపై కింది కోర్టులు స్టే విధించడాన్ని తోసిపుచ్చాయి. నవంబర్ 13న రాణా యూఎస్ సుప్రీంకోర్టులో ‘‘రిట్ ఆఫ్ సిర్టియోరారీ పిటిషన్’’ దాఖలు చేశాడు. రాణాకు ఇదే చివరి అవకాశం ఒకవేళ సుప్రీంకోర్టు అతడి పిటిషన్‌కి కొట్టేస్తే భారత్‌కి అప్పగించాల్సిందే.
రానా 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్-అమెరికన్, లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకి సంబంధం కలిగి ఉన్నాడు. 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటల పాటు ముంబై నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది మరణించారు. మరణించిన వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ దాడిలో అజ్మల్ కసబ్ మినహా అందరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. కసబ్‌ని మన దేశ న్యాయస్థానాల తీర్పు మేరకు ఉరితీసి శిక్ష అమలు చేశారు.