Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
- బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
- చైనా ప్రాజెక్ట్ రక్షణ కోసమే ఇదంతా..
- చైనీయులను టార్గెట్ చేస్తూ బీఎల్ఏ దాడులు..
- సీపెక్ ప్రాజెక్టుకు బలూచిస్తాన్ కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్‌లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. బలూచిస్తాన్ వ్యాప్తంగా దాడులు పెరగడంపై, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ భద్రతా పరిస్థితిని చర్చించడానికి మంగళవారం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో సివిల్, మిలిటరీ అధికారులతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశాన్ని నిర్వహించారు.
బలూచిస్తాన కేంద్రంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ (ఆత్మహత్య దళం), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF), మరియు బలూచ్ రాజీ ఆజోయ్ సంగర్ (BRAS)తో సహా బలూచిస్తాన్‌లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలపై సమగ్ర సైనిక చర్యను పాక్ ప్రభుత్వం ఆమోదించింది. పాక్ పౌరులతో పాటు విదేశీ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో అభద్రతా భావం సృష్టించేందుకు శత్రు బాహ్య శక్తుల ఆదేశంతో ఈ సంస్థలు పనిచేస్తూ, దేశ ఆర్థిక పురోగతిని దెబ్బ తీస్తున్నాయని పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి షరీఫ్ కేబినెట్ సభ్యులు, ప్రావిన్షియల్ సీఎంలు, త్రివిధ సాయుధ సర్వీసుల చీఫ్‌లు హాజరయ్యారు.
Also Read
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
Read Also: Gautam Adani: ట్రంప్‌కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?
విస్తీర్ణంలో అతిపెద్ద ప్రాంతం, అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతంగా బలూచిస్తాన్‌కి పేరుంది. ఈ ప్రావిన్సులో అపారమైన ఖనిజ, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీటిని దోచుకుంటున్న పాక్ ప్రభుత్వానికి, చైనాకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని బలూచిస్తాన్ వేర్పాటువాదులు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతంలో ఇబ్బందులు కలుగజేస్తుందని పాక్ ఆరోపిస్తోంది.
ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) వెళ్తోంది. ఈ ప్రాంతంలోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సును కలుపుతూ రోడ్లు, రైలు మార్గాలను నిర్మిస్తున్నారు. తరుచుగా బీఎల్‌ఏ, ఇతన వేర్పాటువాద సంస్థలు ఈ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా అందులో పనిచేస్తున్న చైనా వ్యక్తుల్ని, పాక్ ఆర్మీ, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తోంది. ఒకానొక దశలో చైనా తమ పౌరుల భద్రతపై పాకిస్తాన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ దాడుల్ని తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!