BJP: హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తిరస్కరించి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే, కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ ఓడిపోతే ఈవీఎంల గురించి ఏడుస్తారు. మరి, గెలిస్తే కాంగ్రెస్ విజయం అని చెబుతారు. ఈవీఎంలు కాదు, కాంగ్రెస్ ఉద్దేశాలే చెడ్డవి’’అని బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో రాహుల్ గాంధీ సోదరి వయనాడ్ గెలుపు గురించిన ఫోటో పెట్టింది. ‘‘ఈవీఎంల వల్ల హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయింది. రాహుల్, ప్రియాంకా బలం వల్లే వయనాడ్‌లో గెలిచింది’’ అని సెటైరికల్ పోస్టుని జత చేసింది.
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 స్థానాలు ఉన్న రాష్ట్రంలో బీజేపీ మహాయుతి కూటమి ఏకంగా 233 సీట్లు గెలిస్తే, 49 స్థానాలకే ఎంవీఏ పరిమితమైంది. ఈ గెలుపు తర్వాత కాంగ్రెస్ నేతలు ఈవీఎంలపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల మాట్లాడుతూ.. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, దీని కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లాగా మరో యాత్ర చేయాలని పిలుపునిచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం ద్వారా బీజేపీ విజయాలు సాధిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
मीठा-मीठा गप-गप, कड़वा-कड़वा थू-थू।
हारे तो EVM का रोना शुरू और जीते तो जीत कांग्रेस की…
EVM नहीं, कांग्रेस की नीयत ही खराब है! pic.twitter.com/TyTqwiTm1P
— BJP (@BJP4India) November 28, 2024