Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాబోయే ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ని నిలబెట్టింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడి ఉన్న హుస్సేన్‌ని ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కౌన్సిలర్‌గా ఉన్న తాహిర్ హుస్సేన్‌ని ఆప్ బహిష్కరించింది. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.
‘‘ఢిల్లీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఎంఐఎంలో చేరారు. రాబోయే ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో ముస్తాఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా అభ్యర్థిగా నిలబెడుతున్నాము. అతడి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఈ రోజు నన్ను కలుసుకుని పార్టీలో చేరారు’’ అని ఓవైసీ ధృవీకరించారు. 2020 ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుస్సేన్ నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటని..? బీజేపీ ప్రశ్నిస్తోంది.
Read Also: Best Yoga Poses: ఆడవారు రొమ్ము పరిమాణం పెంచుకోవడానికి యోగా ఆసనాలు వేస్తే సరి
బీజేపీ నేత కపిల్ మిశ్రా దీనిపై స్పందించారు. ‘‘అంకిత్ శర్మ హత్యకు కారణమైన వ్యక్తితో ఓవైసీ పొత్తు పెట్టుకున్నాడు. అతడి ఇంట్లో బాంబులు, రాళ్లు కనుగొబడ్డాయి. వందలాది మంది హిందువులనను చంపడానికి ప్రయత్నించాడు. ఢిల్లీలో తాహిర్ హుస్సేన్ పేరుతో ఢిల్లీలో మరోసారి అల్లర్లు జరిగితే, దాని పరిణామాలు అతడి ఏడు తరాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇతడిపై ఉన్న ఎఫ్ఐఆర్లను రద్దు చేసి ఉపశమనం కల్పించింది. ఫిబ్రవరి 27, 2020న తాహిర్ హుస్సేన్ భవనంలోని మొదటి అంతస్తు నుంచి అల్లర్లు, విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే ఘటనకు సంబంధించిన మరో కేసులో హుస్సేన్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కోర్టు తెలిపింది. ఫిబ్రవరి 24, 2020న జరిగిన ఇదే ఘటనకు సంబంధించి ముందుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని కోర్టు గమనించింది. ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ అసలు కేసుకు అనుబంధంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసలో 53 మంది మరణించారు. దాదాపుగా 700 మంది గాయపడ్డారు.