Sonia Gandhi: బీజేపీ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్‌పై విరుచుకుపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికాలోని డీప్‌స్టేట్, దాని వెనక జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కుట్రలు చేస్తు్న్నారని, ఈ కుట్రల వెనక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఈ వ్యాఖ్యలను అమెరికన్ రాయబార కార్యాలయం ఖండించింది. నిరాధారమైన ఆరోపణలు, దురుద్దేశపూరితమైన నివేదికలతో భారత దేశ వృద్ధిని దెబ్బతీసేందుకు అమెరికా డీప్ స్టేట్ పనిచేస్తోందని, ఇది కొంతమంది జర్నలిస్టులతో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కుమ్మక్కయ్యాయని సంబిత్ పాత్ర ఆరోపించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి బీజేపీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్‌ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. ఈ అసోసియేషన్ భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతుందని ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది.
సోనియా గాంధీ కో ప్రెసిడెంట్‌గా ఉన్న ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్‌డిఎల్-ఎపి) ఫౌండేషన్‌కు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ పేర్కొంది. ముఖ్యంగా ఎఫ్‌డిఎల్-ఎపి ఫౌండేషన్ కాశ్మీర్‌ని ప్రత్యేక దేశంగా భావిస్తున్నట్లు తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు బీజేపీ తెలిపింది. సోనియాగాంధీ కాశ్మీర్ స్వతంత్ర దేశంగా సమర్థించిన ఒక సంస్థతో అనుబంధం, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని, దాని రాజకీయాన్ని వ్యక్తపరుస్తుందని చెప్పింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షత వహించడం వల్ల జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి దారితీసిందని బీజేపీ పేర్కొంది.
‘‘అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ జార్జ్ సోరోస్ నిధులతో నడిచే OCCRP ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. దీనిని రాహుల్ గాంధీ అదానీని విమర్శించేందుకు ఓ సోర్స్‌గా వాడుకుంటున్నాడు. ఇది వీరి మధ్య బలమైన, ప్రమాదకరమైన సంబంధాన్ని చూపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి వారి ప్రయత్నాలను హైలెట్ చేస్తుంది’’ అని బీజేపీ చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ జార్జ్ సోరోస్ తనకు పాతమిత్రుడని బహిరంగంగా అంగీకరించిన విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది.
This thread underlines a connection between the Congress party and George Soros, implying their shared goal of diminishing India's growth.
Sonia Gandhi, as the Co-President of the FDL-AP Foundation, is linked to an organisation financed by the George Soros Foundation.
Notably,… pic.twitter.com/q9mrJ1lY3h
— BJP (@BJP4India) December 8, 2024