Venu Goapl Reddy
Author- NTV Telugu-
Gautam Adani: పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ కుటుంబం..
Gautam Adani: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబం పాల్గొంది. శనివారం పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీతో పాటు ఆయన భార్య ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీలు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపుకు సంబంధించిన పూజా ఆచారాలకు వీరు హాజరయ్యారు. ఇదే కాకుండా, ప్రసాదం తయారు చేయడంలో అదానీ కుటుంబం పాలుపంచుకుంది. -
India Bangladesh: బంగ్లాదేశ్‌ని దారుణంగా శిక్షించిన మోడీ సర్కార్.. ఏం చేసిందంటే..
India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ చేసింది. మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నా యూనస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు సందర్భాల్లో మైనారిటీలపై దాడుల గురించి ఇండియా ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా భారత్ సంచలన నిర్ణయాలు […] -
Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..
Kartik Maharaj: 2013లో పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీజేపీకి అనుకూలంగా ఉండే కార్తీక్ మహరాజ్‌పై ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలను అతను ఖండించారు. భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి మహారాజ్, ముర్షిదాబాద్‌లోని ఒక ఆశ్రమంలో ఉన్న ఒక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనను తీసుకెళ్లాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమెకు అదే ఆశ్రయంలో వసతి ఏర్పాటు చేశారు. -
Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..
Pregnant Woman: మహారాష్ట్రలోని జల్నా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ పొత్తికడుపుపై యాసిడ్ పోశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రసవ సమయంలో మెడికల్ జెల్లీకి బదులుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రుద్దారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై శనివారం అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. -
Parag Jain: ‘‘రా’’ కొత్త చీఫ్‌గా పరాగ్ జైన్.. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర..
Parag Jain: రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) తదుపరి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ని మోడీ ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్ జూలై 1 నుంచి రెండళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం రా చీఫ్‌గా ఉన్న రవి సిన్హా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగుస్తోంది. Read Also: Ahmedabad Plane Crash: దర్యాప్తు అధికారికి […] -
Donald Trump: యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం.. “జన్మతా పౌరసత్వం”పై అనుకూలంగా తీర్పు..
Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ విజయం లభించింది. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ట్రంప్ అధికారాలను కట్టడి చేయడాన్ని సుప్రీంకోర్టు పరిమితం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నంపై 6-3తో తీర్పు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులు దేశవ్యాప్తంగా జారీ చేసిన నిషేధాలు చట్ట సభలు కోర్టులకు ఇచ్చిన అధికారాలను మించిపోయేలా ఉందని కోర్టు పేర్కొంది. -
PM Modi: జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్‌లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో పర్యటిస్తారు. -
India Russia: రష్యా నుంచి మరో రెండు S-400లు.. Su-30 MKI అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్..
India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి. -
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగింది.. “రాజ్యాంగ పీఠిక” వివాదంపై రాహుల్ గాంధీ..
Rahul Gandhi: రాజ్యాంగ పీఠికలో ‘‘లౌకిక’’, ‘‘సోషలిస్ట్’’ పదాలను తీసేయాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ఈ పదాలను కొనసాగించడంపై చర్చకు పిలుపునిచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. -
Matrimonial Fraud: రెండో పెళ్లి కోసం చూస్తే.. భరణంగా వచ్చిన రూ. 3.6 కోట్లు కొల్లగొట్టిన మోసగాడు..
Matrimonial Fraud: మ్యాట్రిమోనీ సైట్లను నమ్ముకుని మోసపోతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తప్పుడు మాటలు చెప్పడం, మహిళల్ని నమ్మించడం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా పూణేకు చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం చూస్తే, ఆమెకు మొదటి భర్త ద్వారా వచ్చిన భరణం డబ్బుల్ని మోసపోవాల్సి వచ్చింది. మోసం చేసని వ్యక్తిని పూణే సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ రోహిత్ ఒబెరాయ్ అనే ఆస్త్రేలియా డాక్టర్‌గా నటిస్తూ, […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!