Divorce Case: బిడ్డకు పేరు పెట్టే విషయంపై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు విడాకులు వరకు వెళ్లింది. తమ బిడ్డకు పేరు పెట్టడంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై దంపతులు విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి 2021లో జన్మించిన తన కుమారుడి పేరు పెట్టే కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వివాదం మొదలైంది. 21 ఏళ్ల భార్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతను వెళ్లలేదు. భార్య పెట్టిన పేరు అతడికి నచ్చకపోవడంతో కార్యక్రమానికి హాజరుకాలేదు. పిల్లాడికి భార్య ‘‘ఆది’’ అని పేరుపెట్టింది.
Read Also: Court: భార్యకు రూ2లక్షల మధ్యంతర భృతి ఇవ్వాలని తీర్పు.. భర్త ఏం చేశాడంటే..!
నెలల తరబడి వాదనల అనంతరం మహిళ తనకు భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టుని ఆశ్రయించింది. న్యాయమూర్తులు ఇచ్చిన సూచనల్ని కూడా సదరు జంట తిరస్కరించింది. అయితే, గత వారం మైసూర్ సెషన్ కోర్టు జడ్జ్ తల్లిదండ్రుల్ని పిలిచి, మూడేళ్ల బాలుడికి ఆర్యవర్ధన్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వివాదం ముగిసిపోవడంతో దంపతులిద్దరు తమ బిడ్డతో సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఇదే తొలిసారి కాదు. విడిడిపోయిన తల్లిదండ్రులు చిన్నారికి ఏ పేరు పెట్టాలనే విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో గతేడాది కేరళ హైకోర్టు మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టింది.