BJP: ఢిల్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై బీజేపీ దాడి ప్రారంభించింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆలయ పూజారులకు, గురుద్వారా గ్రాంథీలకు ప్రతీ నెలా రూ. 18,000 ఇస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన తర్వాత.. ‘‘ ఎన్నికల హిందువు’’ అంటూ బీజేపీ విమర్శలు ప్రారంభించింది.
Read Also: 50 Cars Punctured: ముంబై-నాగ్‌పూర్ హైవేపై 50కి పైగా ట్రక్కులు, కార్లు పంచర్.. ఎందుకో తెలుసా..?
కేజ్రీవాల్‌ని భూల్ భులయ్యా సినిమాలో రాజ్‌పాల్ యాదవ్ క్యారెక్టర్‌ని ఉద్దేశిస్తూ ఎగతాళి చేసింది. కేజ్రీవాల్ మెడలో రుద్రాక్ష పూసులు, పూల దండలతో అలంకరించిన ఫోటోని ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది. ఎన్నికల ముందు దేవాలయాలను సందర్శించడం, సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయడం కేజ్రీవాల్‌కి అలవాటే అనే అర్థం వచ్చేలా బీజేపీ కామెంట్స్ పోస్ట్ చేసింది. గత పదేళ్లుగా ఇమామ్‌లకు జీతాలు అందించడంలో బిజీగా ఉన్న వ్యక్తి, అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించి వ్యక్తి, దేవాలయాలు, గురుద్వారాల దగ్గర మద్యం దుకాణాలు తెరిచిన వ్యక్తి అని కేజ్రీవాల్‌ని ఉద్దేశించి బీజేపీ విమర్శలు గుప్పించింది.
అయితే, బీజేపీ ప్రచారంపై కేజ్రీవాల్ స్పందించారు. తనను తిట్టడానికి బదులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలనున అమలు చేయాలని చెప్పారు. బీజేపీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, గుజరాత్‌లో 30 ఏళ్లుగా అధికారంలో ఉంది, అక్కడి పూజారులను ఎందుకు గౌరవించలేదు అని ప్రశ్నించారు.