Andhra tourist: గోవాకు టూరిస్టులు తగ్గిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది గోవాకు వెళ్లే టూరిస్టుల సంఖ్య తగ్గింది. అక్కడికి వెళ్లి మోసపోతున్నామని చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లడానికి మోగ్గు చూపుతున్నారు. ఎయిర్‌పోర్టులో దిగినప్పటి నుంచి టాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి హోటల్ రూంల వరకు అన్నింట స్కామ్‌లకు గురవుతున్నామనే అభిప్రాయం టూరిస్టుల్లో నెలకొంది. దీనికి తోడు అక్కడి స్థానికుల ప్రవర్తన కూడా టూరిస్టుల పట్ల సరిగా ఉండటం లేదనే అభియోగం ఉంది.
ఇదిలా ఉంటే, గోవాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టూరిస్ట్ హత్యకు గురువ్వడం సంచలనంగా మారింది. బీష్ షాక్ సిబ్బంది, సమయం దాటిందని ఫుడ్ ఆర్డర్ తీసుకోమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు ఫుడ్ ఆర్డర్ వివాదంలో టూరిస్ట్ గ్రూప్‌కి బీష్ షాక్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన 28 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
Read Also: Hamas Attack On Israel: ఇజ్రాయిల్‌పై దాడికి 7 ఏళ్ల నుంచే నిఘా పెట్టిన హమాస్..
మృతుడిని భోలా రవితేజగా గుర్తించామరి, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. షాక్ యాజమాని అగ్నెల్ సిల్వేరా(64), అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియా(23), ఇద్దరు సిబ్బంది అనిల్ బిస్టా(24), సమల్ సునర్(23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘తెల్లవారుజామున 1 గంటలకు కలంగుట్ బీచ్‌లోని మెరీనా షాక్ వద్ద ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంపై వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు తేజపై చెక్క కర్రలతో దాడి చేశారు. తలకు బలమైన గాయం కావడంతో తేజ మరణించాడు.’’ అని నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.
ఆర్డర్ తీసుకునే టైం దాటిందని, ఇక ఫుడ్ ఆర్డర్ తీసుకోమని షాక్ సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది. ఇంతకుముందు ఆర్డర్ చేసిన ఫుడ్‌కి బిల్లు చెల్లించమని టూరిస్ట్ గ్రూప్ చెప్పడంతో హింసాత్మక దాడికి కారణమైంది. గోవాలో గత కొన్ని రోజుల్లో ఇది మూడో మరణం. అంతకుముందు 26 ఏళ్ల ఢిల్లీ నివాసి నవంబర్‌లో సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహారాష్ట్రకు చెందిన పర్యాటకుడు బోట్ బోల్తా పడి మరణించాడు.