Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
Ghaziabad: కస్టమర్లకు ఇచ్చే రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోటీలు తయారు చేసే సమయంలో ఓ వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. లోధి చౌక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఉన్న ఒక తినుబండారాల షాపులో పనిచేస్తున్న 20 ఏళ్ల ఇర్ఫాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Couple Suicide: కుటుంబ తగాదాలు భార్యభర్తల ఆత్మహత్యలకు కారణయ్యాయి. ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతుల ఏడాది వయసు ఉన్న పాప ప్రస్తుతం అనాథగా మారింది. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని లోనీ బోర్డర్ ప్రాంతంలో జరిగింది. విజయ్ ప్రతాప్ చౌహాన్ (32) , అతని భార్య శివాని (28) మధ్య గొడవ విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Donald Trump: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోలో ఈ మీటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటి వరకు ఇటు మెటా కానీ, అటు ట్రంప్ వర్గం కాని స్పందించలేదు.
Big Scam: ‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిగా చేయడం.’’ ఇదే ఓ ముఠా నినాదం. బీహార్‌కి చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. సైబర్ స్కామర్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ని నడిపారు. దీని ద్వారా వారు కస్టమర్లను ఆకర్షించి, వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Jagjit Singh Dallewal: రైతు నాయకుడు జగ్లీత్ దల్లెవాల్ నిరాహార దీక్ష విరమించాలని పంజాబ్ బీజేపీ అకల్ తఖ్త్కి విజ్ఞప్తి చేసింది. పంటలకు చట్టబద్ధమైన ఎంఎంస్పీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష 46వ రోజుకు చేరుకుంది. అయితే, తాను నిరాహార దీక్ష విరమించాలనుకుంటే బీజేపీ నేతలు అకల్ తఖ్త్‌ని కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని శుక్రవారం కోరారు.
HimKavach: తీవ్రమైన చలి పరిస్థితుల్లో పనిచేసే సైనికులను రక్షించడానికి డీఆర్డీవో (DRDO) 'హిమ్కవచ్' దుస్తుల వ్యవస్థను అభివృద్ధి చేసింది. 20 సెల్సియస్ డిగ్రీల నుంచి -60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలలో పనిచేయడానికి రూపొందించిన ఈ మల్టీలేయర్ వ్యవస్థ కలిగిన దుస్తులు వినియోగించేందుకు ఇప్పుడు అన్ని వినియోగదారు ట్రయల్స్‌ని క్లియర్ చేసింది.
Donald Trump: ఒక నేరస్థుడికి శిక్ష పడిన మొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. హుష్ మనీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌కి ఈ రోజు అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి ‘‘షరతులు లేని విడుదల’ శిక్ష విధించబడింది. అంటే, ప్రస్తుతం ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు తన ఆరోపణలకు దోషిగా తేలాడని అర్థం.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రోజురోజుకి భారత వ్యతిరేకత పెరుగుతోంది. హింసాత్మక ఉద్యమం తర్వాత ఆగస్టు 05న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యాడు.