Kerala: కేరళలో దారుణం.. టీనేజర్‌పై 64 మంది లైంగిక వేధింపులు..
- కేరళలో దారుణం..
- 5 ఏళ్లుగా బాలికపై 64 మంది లైంగిక వేధింపులు..
- ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్‌లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
మహిళా సమాఖ్య అనే ఎన్జీఓ సభ్యులు తమ దినచర్యలో భాగంగా ఫీల్డ్ విజిట్‌కి భాగంగా బాలిక ఇంటికి వెళ్లిన సమయంలో, ఈ దారుణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ బాలికకు కౌన్సిలింగ్ అందించింది. కౌన్సిలింగ్ సమయంలో సైకాలజిస్ట్ దగ్గర తాను 13 ఏళ్లుగా ఎదుర్కొంటున్న భయానక అనుభవాలను తెలిపింది. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
Read Also: Virat Kohli: కుటుంబం మొత్తంతో సాధువును కలిసిన విరాట్.. వీడియో వైరల్
13 ఏళ్ల వయసులో తన పొరుగువాడి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. అతను అశ్లీల చిత్రాలను తనతో పంచుకున్నట్లు చెప్పింది. తన పాఠశాలలో క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్న సదరు బాలికను, శిక్షణా సెషన్లలో లైంగికంగా వేధింపులకు గురిచేసిన సందర్భాలను వెల్లడించింది. తన వీడియోలు కొన్ని సర్క్యులేట్ అయ్యాయని, ఇది ఈ వేధింపులను మరింతగా పెంచినట్లు తెలిపింది.
ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందికి పైగా వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక నుంచి వివరణాత్మక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత సీడబ్ల్యుసీ పతనంతిట్ట జిల్లా చైర్‌పర్సన్ ఎన్ రాజీవ్ మాట్లాడుతూ.. బాధితురాలకి అవసరమైన సంరక్షణ, రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని, ఆ బాలిక 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురైందని చెప్పాడు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆమెపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని రాజీవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!