Rahul Gandhi: హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కోర్టు రూ. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభ మేళ’’కి యోగీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మన దేశం నుంచే కాకుండా సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న చాలా మంది విదేశీయులు కుంభ మేళకు రాబోతున్నారు.
Giorgia Meloni: బిలియనీర్ జార్జ్ సోరోస్ విదేశాల రాజకీయాల్లో జోక్యానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇత దేశాల రాజకీయాల్లో కలుగుజేసుకుంటున్నారని ఆమె అన్నారు. దేశాలను అస్థిరపరచడానికి తన డబ్బును ఉపయోగిస్తున్నారని మెలోనీ గురువారం అన్నారు. యూరప్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న తరుణంలో మెలోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో యూరప్‌లో రాజకీయాల […]
Pakistan: ఆర్థిక సంక్షోభం, అప్పులు, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కి జాక్‌పాట్ తగిలింది. సింధునదిలో ‘‘బంగారు నిల్వలు’’ ఉన్నట్లు తేలింది. ప్రాచీన సింధు లోయ నాగరికతకు ఈ నది తల్లిగా ఉంది. అద్భుతమైన నాగరికత ఈ నదీ ఒడ్డునే వెలిసింది. మెహంజోదారో, హరప్పా వంటి గొప్ప నగరాలు ఈ నాగరికతలో వెలిశాయి. ఋగ్వేదంలో కూడా సింధు నదీ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య హరప్పా నాగరికతకు కీలకంగా సింధునది ఉంది.
PM Modi: భారతీయ అంతరిక్ష విజయాల్లో ‘‘చంద్రయాన్’’ ప్రయోగానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్ల క్రితం చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు ‘‘చంద్రయాన్-2’’ ప్రయోగం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో చంద్రుడిపై కుప్పకూలింది.
PM Modi: నిఖిల్ కామత్‌తో తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పోడ్కాస్ట్లో పాల్గొన్నారు. తన చిన్నతనం నుంచి రాజకీయంగా ఎదిగిన క్రమాన్ని, ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఈ రోజు నిఖిల్ కామత్ ‘పీపుల్’ సిరీస్‌లో మోడీ పాడ్‌కాస్ట్‌లో అరంగ్రేటం చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ కీలక విషయాలను వెల్లడించారు. 2017లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తన సొంత ఊరు గుజరాత్‌లోని వాద్నగర్లో పర్యటించడం వెనక ఉన్న చరిత్రను వెల్లడించారు.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు.
INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి.
Greenland: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలు సంచలనంగా మారాయి. గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు.