Sambhal Mosque: గతేడాది నవంబర్‌లో ఘర్షణకు కేరాఫ్‌గా మారిన ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాష్ ‘‘షాహీ జామా మసీదు’’ మరోసారి వార్తల్లో నిలిచింది. రంజాన్‌కి ముందు మసీదుని పునరుద్ధరించడానికి జామా మసీదు యాజమాన్యం ఏఎస్ఐ అనుమతిని కోరింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, సంభాల్ జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదులో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్ కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై సోమవారం కొంత మంది నేరస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు బంగ్లాదేశ్ సైన్యం ధ్రువీకరించింది. సోర్సెస్ ప్రకారం.. బాధితుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌గా గుర్తించారు. ఇతడిని కాల్చి చంపినట్లు సమాచారం. Read Also: Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..? బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) […]
Maharashtra: మహారాష్ట్ర అధికార కూటమి ‘‘మహాయుతి’’లో చీలిక కనిపిస్తోంది. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సమావేశాలకు హాజరుకావడం లేదు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ని త్వరలో వీడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బుధవారం ప్రారంభం కానున్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మలయాళ భాషా పాడ్‌కాస్ట్ ‘వర్తమానం’లో కేరళలో కాంగ్రెస్ నాయకుడు లేకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. పాడ్ కాస్ట టీజర్ ఇప్పటికే విడుదలైంది. ‘‘పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు సొంత పనులు […]
German Election: జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంచలనం నమోదు కాబోతోంది. తదుపరి జర్మనీ ఛాన్సలర్‌గా కన్జర్వేటివ్ కూటమి విజయం దిశగా వెళ్తోందని ఆదివారం అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మరోవైపు ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన ఓటమిని అంగీకరించారు. తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్రిక్ మెర్జ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
Bomb threat: న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని దారి మళ్లించి రోమ్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. రోమ్ విమానాశ్రయంలో భద్రతా అనుమతి పొందిన తర్వాత విమానం మళ్లీ ఢిల్లీ బయలుదేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. Read Also: IND vs PAK: క్రేజ్ అంటే ఇదేరా.. పెళ్లి వేడుకలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లైవ్ బోయింగ్ 783 […]
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం ఉందని అన్నారు. గతంలో కూడా స్టాలిన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గతంలో స్టాలిన్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రజలు ‘‘16 మంది పిల్లలను’’ పెంచడం గురించి ఆలోచించేలా చేస్తోందని, 16 రకాల సంపదలపై తమిళ సామెతను ఉదహరిస్తూ అన్నారు.
Donald Trump: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు 21 మిలియన్ డాలర్లను యూఎస్ఎయిడ్ ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు.
US deports Indians: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని వారి దేశాలకు బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇల్లీగల్ భారతీయ వలసదారులను కూడా అమెరికా బహిష్కరించింది. తాజాగా, 4వ బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన విమానం ఈ రోజు ఇండియాకు చేరింది.
Bangladesh: టెక్ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రధాన సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ తమ దేశాన్ని సందర్శించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ మేరకు యూనస్, మస్క్‌కి లేక రాసినట్లు తెలుస్తోంది.