Bengaluru: “మాజీ ప్రియురాలి” ఇంటిని తగలబెట్టిన వ్యక్తి.. కార్లు, బైకులకు నిప్పు..
- మాజీ ప్రియురాలి ఇంటిపై వ్యక్తి దాడి..
- కార్లు, బైకులకు నిప్పు..
- కుటుంబమే తమని విడదీసిందంటూ హంగామా..
- బెంగళూర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: తాను ప్రేమించిన అమ్మాయి దూరమైందనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సదరు అమ్మాయి తండ్రి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూర్‌లో జరిగింది. మొత్తం మూడు కార్లను తగులబెట్టడంతో పాటు ఒక బైక్‌ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మూడు కార్లలో రెండు అమ్మాయి తల్లిదండ్రులవి కాగా, బైక్ ఆమె సోదరుడిది. నిందితుడు లక్ష్యంగా చేసుకున్న రెండు కార్ల పక్కన మరో కారు ఉండటంతో అది కూడా తగలబడింది. ఈ మొత్తం ఘటన అక్కడే ఉన్న సీనీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
ఈ సంఘటన చన్నమనకెరె అచ్చుకాటు, సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. నిందితుడిని రాహుల్ అలియాస్ స్టార్ రాహుల్‌గా గుర్తించారు. ఇతడికి నేర చరిత్ర ఉంది. నిందితుడిపై 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాహుల్‌పై హత్యాయత్నం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ వంటి కేసులు నమోదయ్యాయి. కులు రిజ్వాన్ అనే రౌడీ షీటర్‌కి రాహుల్ అత్యంత సన్నిహితుడని సమాచారం. రాహుల్ 2002 జనవరిలో పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ, అతడి కాళ్లపై కాల్పులు జరిపారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: Sambhal Mosque: ఏఎస్ఐ అనుమతి లేకుండా “సంభాల్ మసీదు”లో ఎలాంటి పనులు జరగకూడదు..
రాహుల్, అతడి గ్యాంగ్ కార్లను తగలబెట్టడానికి ముందు వాటి అద్దాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాహుల్ సదరు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయిని తన నుంచి కుటుంబం దూరం చేసిందనే కోపంతో రాహుల్, తన ముగ్గురు సహచరులతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అమ్మాయి తండ్రి ఇంటికి వెళ్లి, ఆమె సోదరుడిపై దాడి చేశాడు. కుటుంబమే తన నుంచి ఆమె నుంచి వేరు చేసిందని ఆరోపించాడు.
వాహనాల ధ్వంసం తర్వాత, రాహుల్ అమ్మాయి, ఆమె తల్లి నివాసం ఉంటున్న ఆరెహల్లి లోని ఒక అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ అమ్మాయితో మాట్లాడలేకపోవడంతో ఆమె తల్లి కారుకు కూడా నిప్పు పెట్టారు. నిందితులు సొసైటీ వాచ్‌మెన్‌పై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
A jilted lover / History Sheeter Rahul went on rampage in South Bengaluru, torches 3 cars & damaged a bike after his girlfriend distanced herself from him.Out of 3 gutted cars,2 belonged to Girl's parents.Police is yet to arrest rahul.. pic.twitter.com/364Ba3hlfa
— Yasir Mushtaq (@path2shah) February 24, 2025
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!