Shehbaz Sharif: ‘‘భారత్‌ని ఓడించకపోతే నా పేరు షెహాబాజ్ షరీఫ్ కాదు’’.. పాక్ ప్రధాని పేరు మార్పు తప్పదేమో..
- భారత్ గురించి పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రగల్భాలు..
- ఇండియాను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మతఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పెద్దపెద్ద సవాళ్లు చేస్తోంది. ఏ దశలోనూ భారత్‌తో పోలిక లేదు, అయినా భారత్‌ని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. తినడానికి తిండి లేకపోయినా, కింద కోట్ల అప్పులు ఉన్నా కూడా వాస్తవాలను మరిచి ప్రవర్తించడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
Read Also: Mahindra: స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ పేరు మార్చుకునే అవకాశం ఉంది. ఆయన పంజాబ్ ప్రావిన్స్ లోని డేరా ఘాజీఖాన్‌ని ఇటీవల సందర్శించిన సమయంలో, ఒక బహిరంగ సభలో చాలా ఉత్సాహంగా కనిపించారు. అక్కడ ఉన్న జనాలను చూసి వాస్తవాలను మరిచిపోయి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ‘‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ని ఓడించకపోతే తన పేరు షెహజాబ్ షరీఫ్ కాదు’’ అని సవాల్ విసిరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అప్పుల నుంచి బయటపడటమే కష్టం, అలాంటిది ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ని దాటడం అంటే పాక్‌కి అసాధ్యం. దీంతో ఆయన పేరు మార్చుకోవడం పక్కా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆయన మాటల్ని సొంత దేశ ప్రజలు కూడా నమ్మడం లేదు.
ఇదే కాకుండా.. సామాన్యుల అవసరాలను తీర్చడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రజలకు హామీ ఇస్తూ, “పాకిస్తాన్‌లో పరిస్థితి మెరుగుపడటానికి మేము పగలు మరియు రాత్రి పని చేస్తాము. సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ పాకిస్తాన్‌ను ఆశీర్వదించాడు” అని షరీఫ్ అన్నారు. తన అన్నయ్య, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చూపిన మార్గంలో పయనిస్తున్నానని చెప్పారు. పాకిస్తాన్‌ని గొప్పగా తీర్చదిద్దడానికి, భారత్‌ని ఓడించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ ప్రగల్భాలు పలికిన రెండు వారాలకే, భారత్ తమతో చర్చలు ప్రారంభించాలని వేడుకోవడం షెహజాబ్‌కే చెల్లింది.
🛑🛑 If I don't defeat India, my name is not Shehbaz Sharif.
We will defeat regional competitors like India in economic development.”
— Pakistan's Prime Minister
👉 Ek din isko heart attack aa jayega jitna panic hokar bolta hai. 😂😂😂👇 pic.twitter.com/IN0Cy2EQbm
— Naren Mukherjee (@NMukherjee6) February 23, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!