BJP: కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ వ్యవహారం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన కేరళలోని అధికార లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం, ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీని పొగడటంపై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉన్నట్లు సమచారం.
Read Also: 2025 ఫిబ్రవరి నాటికి ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన 10 దేశాలు ఇవే..
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ స్పందించింది. ‘‘కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి చెందిన యాజమాన్య సంస్థ’’గా అభివర్ణించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ.. ‘‘గాంధీ కుటుంబానికి చెందిన నామినీ మల్లికార్జున ఖర్గేపై అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం చేసిన తర్వాత కాంగ్రెస్‌లో శశిథరూర్‌ని అణగదొక్కడం అనివార్యమైంది. ఆయనకు ఉన్న ప్రజల మద్దతు లేకుంటే ఈ అణచివేత వేగంగా, మరింత స్పష్టంగా ఉండేది’’ అని ఆరోపించారు. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖార్గేతో శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఖర్గే ఘన విజయం సాధించారు. దాదాపుగా 3 దశాబ్దాల అనంతరం గాంధీయేతర నేపథ్యం కలిగిన వ్యక్తి కాంగ్రెస్‌కి అధ్యక్షుడయ్యారు.
అంతకుముందు, మలయాళ పాడ్‌కాస్ట్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘తన సేవలు అవసరం లేకపతే తనకు వేరే ఆప్షన్లు ఉన్నాయి’’ అని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జరిగి చేశారు. నాలుగు సార్లు తిరువనంతపురం నుంచి ఎంపీగా గెలిచిన శశిథరూర్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంది. మరోవైపు సీపీఎం నేత థామస్ ఐజాక్, థరూర్‌ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ వీడితే ఆయన అనాథ కాడు అని అన్నారు.