Lex Fridman: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని వర్తమాన అంతర్జాతీయ పరిణామాలు, పాక్ అంశం, ఉక్రెయిన్ వార్, డొనాల్డ్ ట్రంప్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఈ ఇంటర్వ్యూ కోసం తాను 45 గంటల పాటు ‘‘ఉపవాసం’’లో ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్‌మాన్ చెప్పారు. ‘‘సరైన మనస్తత్వాన్ని పొందడానికి’’ దాదాపుగా 2 రోజలు ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రధాని మోడీని ఆశ్చర్యపరిచారు.
Read Also: Ram Charan : ఆటకూలీగా రామ్ చరణ్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరింది
‘‘ఈ ఇంటర్యూకు గౌరవంగా నీరు, ఆహారాన్ని తీసుకోలేదు. 45 గంటలు ఉపవాసం చేశా. సరైన మసస్తత్వాన్ని పొందడానికి, ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోవడానికి’’ అని ఫ్రిడ్‌మాన్ చెప్పారు. ఉపవాసం సమయంలో మనసు ఎక్కడికి వెళ్తుందని అడిగినప్పుడు, ప్రధాని మోడీ ఈ ఆచారం ఎంత పురాతనమైందనే విషయాన్ని వివరించారు. ఇంద్రియాలకు పదును పెట్టడం, మానసిక స్పష్టతను పెంపొందించడానికి, క్రమశిక్షణ పెంపొందించడానికి ఉపవాసం ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పారు. ఉపవాసం సమయంలో తన ఆలోచన విధానం వేగవంతం అవుతుందని మోడీ వెల్లడించారు.