Meerut Murder: మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య ముస్కాన్ రస్తోగి, తన లవర్ సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసింది. శవాన్ని 15 ముక్కలుగా నరికి, డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేసింది. మార్చి 04న జరిగిన ఈ హత్య, సౌరభ్ మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వేరే దేశంలో పనిచేస్తున్న సౌరభ్, తన 6 ఏళ్ల కూతురు పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తర్వాత, పక్కా ప్లాన్‌లో భార్య, ఆమె లవర్ కలిసి హత్య చేశారు.
Read Also: AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్‌లో నిర్మిస్తాం!
అయితే, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 04న ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చిన తర్వాత ముస్కాన్, సాహిల్ ఇద్దరు కలిసి సౌరభ్‌ని కొత్తితో పొడిచి హత్య చేశారు. మత్తులోకి జారుకున్న తర్వాత తన ప్రియుడు సాహిల్‌ని పిలిచి, గొంతు కోసి, గుండెల్లో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని సులభంగా మాయం చేయడానికి సాహిల్ సౌరభ్ చేతులు నరికేశాడు. తర్వాతి రోజు ఉదయం కొత్త డ్రమ్ కొనుక్కుని వచ్చి, సిమెంట్, ఇసుక కొని, సౌరభ్ శరీర భాగాలను డ్రమ్‌లో వేసి కప్పేశారు.
అయితే, ఈ కేసులో మరో విషయం విచారణలో తెలిసింది. ఈ హత్యను ఆరేళ్ల కుమార్తె చూసినట్లు తెలుస్తోంది. ‘‘నాన్న డ్రమ్‌లో ఉన్నాడు’’అని పొరుగు వారికి పదేపదే చెప్పేదని సౌరభ్ తల్లి రేణు దేవి చెప్పింది. హత్య గురించి చిన్నారికి తెలుసని చెప్పింది. ఈ కేసులో ముస్కాన్, సాహిల్ డ్రగ్స్‌కి బానిసైనట్లు తెలుస్తోంది. 2016లో పెద్దలను ఎదురించి ముస్కాన్, సౌరభ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సాహిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ కుమార్తెను సౌరభ్ గుడ్డిగా ప్రేమించాడని, తన కూతురుకు బతికే హక్కు లేదని, ఆమెను ఉరితీయాలని ముస్కాన్ తల్లిదండ్రులు కోరారు. ఈ విషయంలో తాము సౌరభ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.