Delimitation: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన శనివారం మొదటి డీలిమిటేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు.
Pune: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కారణంగా మూడున్నరేళ్ల కొడుకు అన్యాయంగా బలయ్యాడు. పూణేకు చెందిన 38 ఏళ్ల టెక్కీ తన కొడుకు గొంతు కోసి చంపేశాడు. శరీరాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత, నిందితుడైన పిల్లాడి తండ్రి లాడ్జిలో మద్యం సేవించి కనిపించాడు.
India GDP: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా పరుగులు తీస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే భారత జీడీపి ఏకంగా 105 శాతం పెరిగింది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 2015లో $2.1 ట్రిలియన్ల నుండి 2025 నాటికి $4.3 ట్రిలియన్లకు రెట్టింపు అయింది. ఇలాంటి రికార్డ్ ఏ దేశానికి కూడా లేదు. కేవలం పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ డబుల్ అయింది.
Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణహత్యలో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాల పైశాచికం వెలుగులోకి వస్తుంది. పోస్టుమార్టం నివేదికలో వీరిద్దరు ఎంత క్రూరంగా హత్యకు పాల్పడ్డారనే విషయం తెలిసింది. మార్చి 04న భార్య సౌరభ్‌కి మత్తు మందు ఇచ్చి, కత్తితో పొడిచి హత్య చేశారు.
Family Dispute: కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య, గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికింది.
Husband Suicide: భార్య, భార్య తరుపు బంధువల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ వ్యవహారం కూడా ఈ కోవకు చెందినదే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఇది జరిగిన తర్వాత, మరికొందరు కూడా తమ భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Nagpur Violence: ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో పెద్ద ఎత్తున ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. సోమవారం, ప్రార్థనలు ముగిసిన తర్వాత కొందరు ముస్లిం మూక రోడ్లపైకి వచ్చి వాహనాలకు, దుకాణాలకు ముప్పుపెట్టారు. మరో వర్గం దుకాణాలు, వ్యాపారాలను లక్ష్యం చేసుకుని దాడి చేసినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా వెల్లడించారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారింది. ఇటీవల పలు సందర్భాల్లో శశి థరూర్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై కఠినంగా మాట్లాడారు. దీనికి తోడు కేరళలో సీపీఎం ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానంపై ప్రశంసలు కురిపించారు. గతంలో, పార్టీ తనను పట్టించుకోకుంటే, తనకు వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే థరూర్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. Read Also: Deputy CM Pawan Kalyan: […]
Hyderabad: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్‌తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు […]