Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న పదవీచ్యుతురాలైంది. హింసాత్మక ఘటనలతో ఆమె భారత్ పారిపోయి వచ్చింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగాయి. అయితే, అవామీ లీగ్ పార్టీని రద్దు చేస్తారని, పార్టీని నిషేధించాలని యూనస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలు వచ్చాయి.
Read Also: Chhaava: మమతా బెనర్జీ ‘‘ఛావా’’ సినిమా చూడాలి.. యూపీ డిప్యూటీ సీఎం..
అయితే, దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అవామీ లీగ్‌ని నిషేధించే ప్రణాళికలు లేవని, కానీ హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసినవారు దేశ కోర్టుల్లో విచారణ ఎదుర్కుంటారని యూనస్ ప్రెస్ వింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కంఫర్ట్ ఎరో నేతృత్వంలోని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ ప్రతినిధి బృందంతో, యూనస్ భేటీ అయ్యారు. దేశంలో ఎన్నికల కోసం సాధ్యమైన రెండు సమయాలను నిర్ణయించినట్లు ధ్రువీకరించారు.