Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసేలా మృణాల్ ఠాకూర్ పేరుతో ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ కామెంట్ నిజంగా మృణాల్ చేసిందేనా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
కొంతకాలం క్రితం మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ ముంబైలోని ఓ కేఫ్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించారు. ఇద్దరూ ఒకేసారి బయటకు వచ్చినప్పటికీ, వేర్వేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈ నేపథ్యంలో యశస్వితో తన సంబంధంపై మృణాల్ స్పందించారంటూ ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో పుకార్లను నమ్మవద్దని, ఇలాంటి విషయాలపై వీడియోలు చేయడం కంటే సరైన అంశాలపై దృష్టి పెట్టాలని మృణాల్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ వీడియోలో కనిపించడం లేదు. దీంతో ఆ వ్యాఖ్య నిజంగా మృణాల్ చేసినదేనా లేదా అనేది స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది.
మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ మధ్య వయసులో సుమారు 9-10 ఏళ్ల తేడా ఉంది. మృణాల్ వయసు 34 సంవత్సరాలు కాగా, యశస్వి వయసు 24 సంవత్సరాలు. ఇదిలా ఉంటే, గతంలో మృణాల్ ఠాకూర్‌కు నటుడు ధనుష్‌తో సంబంధం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సైతం జరిగింది. అయితే మృణాల్‌కు సన్నిహితులు ఆ వార్తలను ఖండించారు. అయితే, ప్రస్తుతం మృణాల్-యశస్వి డేటింగ్ వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కేఫ్‌లో కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్ ఆధారంగానే ఈ ప్రచారం కొనసాగుతోంది. కాబట్టి వైరల్ అవుతున్న కామెంట్‌ను మృణాల్ అధికారిక స్పందనగా భావించేందుకు ప్రస్తుతం ఆధారాలు లేవని చెప్పాలి.
వైరల్ అవుతున్న కామెంట్ ఇదే..

తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!