Pakistan: పాక్‌లో “గుర్తుతెలియని వ్యక్తుల” హల్చల్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..
- పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల హల్చల్..
- లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..
- హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడిగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ యాక్టివ్ అయ్యారు. గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని అన్-నోన్ గన్‌మెన్ హతమారుస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్‌గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ సిటీలో ముజాహిద్ ఇంటి వెలుపల ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఉగ్రవాదిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Read Also: Indian Student Arrested: స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన మరో భారతీయ విద్యార్థిని..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
హత్యకు గురైన ఉగ్రవాది షేక్ మోయిజ్ ముజాహిద్ చాలా కాలంగా లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఉగ్రసంస్థ ప్రధాన కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఇతను సన్నిహితుడు. మోయిజ్ హత్య తర్వాత స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని దుండగుల కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై ఐఎస్ఐ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ హతమారుస్తున్నారు. ముఖ్యంగా, భారత వ్యతిరేకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదిన్, ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పుడు ఉగ్రవాదులు హడలి చస్తున్నారు. ఎప్పుడు ఎలా మరణిస్తామో తెలియక ఆ దేశ ప్రభుత్వం నుంచి రక్షణ కోరుతున్నారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులు కానీ, ఐఎస్ఐ కానీ ఒక్క గుర్తుతెలియని దుండగుడిని పట్టుకోలేకపోయింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!