1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
- ఆగస్టు 12న జరిగే Made by Google ఈవెంట్లో Google Pixel 11 Series
- Pixel 11 సిరీస్‌లో Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold మోడళ్లు..
- లీక్ ప్రకారం అన్ని మోడళ్లలో బేసిక్ గా 256GB బేస్ స్టోరేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel 11 Series: గూగుల్ (Google) నుండి రాబోయే నెక్స్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్న “మేడ్ బై గూగుల్ (Made by Google)”ఈవెంట్లో లాంచ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ ఈవెంట్‌కు ముందే ఈ సిరీస్ లో రాబోతున్న Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ధరలు, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
గూగుల్ అమెజాన్ స్టోర్‌లో ఈ ఫోన్లకు సంబంధించిన కొన్ని రిటైలర్ లిస్టింగ్స్ కొద్దిసేపు కనిపించి ఆ తర్వాత మాయమయ్యాయి. అయితే అప్పటికే వాటి స్క్రీన్షాట్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వివరాలను గూగుల్ అధికారికంగా ధృవీకరించపోయినప్పటికీ లీకైన సమాచారం ప్రకారం.. Pixel 11 సిరీస్‌లో 128GB బేస్ స్టోరేజ్‌కు గూగుల్ స్వస్తి చెప్పి, అన్ని మోడళ్లలో 256GB స్టోరేజ్‌ను బేస్ వేరియంట్‌గా తీసుకురాబోతున్నారు.
Also Read
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
Google Pixel 11:
లీక్ ప్రకారం గూగుల్ పిక్సెల్ 11 256GB స్టోరేజ్ వేరియంట్ ధర $899గా ఉండనుంది. ఇది భారత కరెన్సీలో ఇది సుమారు రూ.80,000. 512GB వేరియంట్ ధర $1,019గా ఉండొచ్చని సమాచారం. రెండు వేరియంట్లలోనూ 12GB RAM ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లో 6.3 అంగుళాల OLED డిస్ప్లే, 2,856 x 1,280 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో Tensor G6 చిప్సెట్తో పాటు Titan M3 సెక్యూరిటీ చిప్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్ లో 4,985mAh బ్యాటరీ, 13MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని లీకులు పేర్కొంటున్నాయి.
Google Pixel 11 Pro:
పిక్సెల్ 11 ప్రో 256GB బేస్ వేరియంట్ ధర $1,099గా ఉండొచ్చని సమాచారం. అంటే భారత కరెన్సీలో రూ.98,000. 512GB మోడల్ ధర $1,219, 1TB వేరియంట్ ధర $1,449గా ఉండే అవకాశం ఉంది. అలాగే RAM విషయంలో కూడా గూగుల్ మార్పు చేయనున్నట్లు లీకులు చెబుతున్నాయి. 256GB వేరియంట్లో 12GB RAM, 512GB, 1TB వేరియంట్లలో 16GB RAM ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఇందులో 6.3 అంగుళాల OLED డిస్ప్లే, 2,856 x 1,280 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. 4,850mAh బ్యాటరీతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చని సమాచారం. కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 48MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఫోన్లో గరిష్టంగా 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా లభించవచ్చని లీకులు చెబుతున్నాయి.

Pixel 11 Pro XL:
ఈ సిరీస్‌లో పెద్ద స్క్రీన్‌తో రానున్న పిక్సెల్ 11 ప్రో XL 256GB వేరియంట్ ధర $1,299గా ఉండొచ్చని సమాచారం. అంటే సుమారు రూ.1.16 లక్షలు. 512GB మోడల్ ధర $1,419, 1TB వేరియంట్ ధర $1,649గా ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల OLED డిస్ప్లే, 2,992 x 1,344 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇతర Pixel 11 మోడళ్ల మాదిరిగానే ఇందులోనూ Tensor G6 చిప్సెట్ ఉండనుంది. ఇక ఇందులో 5,115mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. కెమెరా విషయంలో Pixel 11 Pro తరహాలోనే ట్రిపుల్ కెమెరా సెటప్, 120x వరకు డిజిటల్ జూమ్, 13MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
Pixel 11 Pro Fold:
గూగుల్ నుండి రాబోయే ఫోల్డబుల్ ఫోన్ Pixel 11 Pro Fold సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. లీక్ ప్రకారం 256GB వేరియంట్ ధర $1,899గా, అంటే సుమారు రూ.1.69 లక్షలుగా ఉండొచ్చు. 512GB మోడల్ ధర $2,019, 1TB వేరియంట్ ధర ఏకంగా $2,249గా ఉండే అవకాశం ఉంది. Pixel 11 Pro Foldలో 6.5 అంగుళాల ఔటర్ OLED డిస్ప్లే, సుమారు 8 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే ఉండనున్నాయి. రెండు స్క్రీన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండొచ్చు. అన్ని స్టోరేజ్ వేరియంట్లలో 16GB RAM అందించే అవకాశం ఉంది. ఫోల్డబుల్ ఫోన్లో 4,750mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్, Qi2 వైర్లెస్ ఛార్జింగ్, Wi-Fi 6E వంటి ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. పైన్, మిడ్ నైట్ కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి.
గూగుల్ అధికారికంగా ఆగస్టు 12, 2026న మేడ్ బై గూగుల్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో Pixel 11 సిరీస్‌ను అధికారికంగా ప్రకటించనుంది. అయితే ప్రస్తుతం లీకైన ధరలు, స్పెసిఫికేషన్లు అధికారికంగా ధృవీకరించబడలేదు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!