Apple: డొనాల్డ్ ట్రంప్ ‘‘టారిఫ్’’ల పుణ్యామా అని, వీటిని తప్పించుకునేందుకు ప్రపంచ దేశాలు ఎగుమతుల్ని పెంచింది. టారిఫ్స్ అమలులోకి రాకముందే పలు దేశాలు అమెరికాకు ఎగుమతుల్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ట్రంప్ ఎఫెక్ట్‌తో ఐఫోన్ ఎగుమతుల్ని పెంచింది. ఏకంగా 600 టన్నుల ఐఫోన్‌లను విమానంలో అమెరికాకు తరలించింది. ట్రంప్ టారిఫ్‌లు అమలులోకి వస్తే ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున యూఎస్‌కి వీటిని తరలించింది.
టెక్ దిగ్గజం ఆపిల్ చార్టర్డ్ కార్గో విమానాల ద్వారా భారత్ నుంచి అమెరికాకు 600 టన్నుల ఫోన్‌లను, అంటే దాదాపుగా 1.5 మిలియన్ల ఫోన్‌ల తరలించినట్లు రాయిటర్స్ తెలిపింది. ఆపిల్ పరికరాలకు ప్రధాన తయారీ కేంద్రంగా చైనా ఉంది. చైనాపై ట్రంప్ 125 శాతం సుంకాలు విధించడంతో వీటి ధరలు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. భారత్‌పై 26 శాతం సుంకాలను ట్రంప్ విధించాడు. అయితే, చైనా మినహా మిగిలిన అన్ని ప్రపంచదేశాలకు మూడు నెలల వరకు సుంకాల విరామం ప్రకటించింది.
Read Also: Tahawwur Rana: కసబ్‌కి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది.. తహవూర్ రాణా అప్పగింతపై కేంద్రమంత్రి..
ఐఫోన్‌లను అమెరికాకు తరలించడానికి, చెన్నైలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన 30 గంటల సమయాన్ని 6 గంటలకు తగ్గించినట్లు తెలుస్తోంది. దీని కోసం ‘‘గ్రీన్ కారిడార్’’ ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి నుంచి 100 టన్నుల సామర్థ్యం కలిగిన దాదాపుగా ఆరు కార్గో జెట్లు అమెరికాకు బయలుదేరాయి. వీటిలో ఒకటి సుంకాలు ప్రకటించిన ఈ వారంలో అమెరికాకు వెళ్లింది.
ఐఫోన్ 14 యొక్క ప్యాక్ చేయబడిన బరువు, దాని ఛార్జింగ్ కేబుల్ దాదాపు 350 గ్రాములు. దీనిని బట్టి చూస్తే 600 టన్నుల కార్గో, అంటే దాదాపుగా 1.5 మిలియన్ల ఐఫోన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఆపిల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది 220 మిలియన్లకు పైగా ఫోన్లను విక్రయించింది. యూఎస్ మొత్తం దిగుమతుల్లో ఐదో వంతు ఇప్పుడు భారత్ నుంచే వెళ్తున్నాయి. మిగిలినవి చైనా నుంచి యూఎస్‌కి ఎగుమతి అవుతున్నాయి. చెన్నైలోని ఫాక్స్‌కాన్ ఫ్లాంట్‌లో ఇప్పుడు ఆదివారాలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఈ ఈ ప్లాంట్ 20 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేసింది, వీటిలో తాజా ఐఫోన్ 15 మరియు 16 మోడళ్లు ఉన్నాయి.