UP: తన భార్య, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన ఓ భర్త, ఇకపై తాను ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసే అవకాశం ఉందని, మీరట్‌లో జరిగినట్లు డమ్ముల్లో ముక్కలు అవ్వడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని మౌరానిపూర్‌లో జరిగింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో గుమస్తాగా పనిచేస్తున్న రీతు వర్మ అనే మహిళ స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్‌తో సంబంధం కలిగి ఉందని ఆమె భర్త పవన్ పోలీసులకు తెలిపారు. సదరు మహిళకు అప్పటికే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.
Read Also: RCB vs DC: రాయల్ ఛాలెంజర్స్ కు హోమ్ గ్రౌండ్ కలిసొచ్చేనా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సిబి
ఈ వ్యవహారం తనకు తెలిసినప్పటి నుంచి విడివిడిగా జీవిస్తున్నామని చెప్పారు. అతడి భార్య కొడుకు మౌరానిపూర్‌లో కలిసి నివసిస్తు్న్నారు. పవన్ యూపీలోని మహోబా జిల్లాలో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాడు. తన భార్య, ఆమె ప్రేమికుడితో కలిసి ఇంట్లో ఉన్నారని తెలిసిందని, ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చానని, తలుపు తెరిచి చూసినప్పుడు స్థానిక కౌన్సిలర్ ఇంటి నుంచి బయటకు వచ్చి పోలీసులను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘‘ నా భార్య నన్ను చంపగలదు, కాబట్టి ఆమెతో నేను జీవించలేనని, ఆమె మాకు విషం కలిపిన టీ ఇవ్వొచ్చు. మా మృతదేహాలు డ్రమ్ లోపల కనిపించే అవకాశం ఉందని’’ పవన్ భయపడుతూ చెప్పాడు.
ఈ సంఘటన తర్వాత, పాఠక్ పారిపోతూ పవన్‌ని ‘‘డ్రమ్’’లో నీ శరీరం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి హత్య చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది.
Mamla jhansi ke mauranipur thane se hai pati duty pe tha patni ghar par apne ashiq ke sath rang lariya mana rahi thi pati jab aya to darwaza band dekha use laga koi andar hai usne gaor kara to yakeen ho gaya andar koi hai jab police ayi to ashiq bahar a kar ulta chadhai karne lga pic.twitter.com/b9I6OApKmJ
— Tabish Khan (@TabishKhan70255) April 10, 2025