Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ క్లాస్ రూం గోడలపై ఆవు పేడ పూస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వల్సల, ఇది ఓ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగమని చెప్పారు. ‘‘ఇది ఒక ప్రాసెస్‌లో భాగం, ఒక వారంలో పరిశోధన పూర్తువుతుంది. అప్పుడు వీటి వివరాలను నేను మీతో పంచుకోగలను. పోర్టా క్యాబిన్లలో పరిశోధన జరుగుతోంది. సహజ బురదను తాకడం వల్ల ఎలాంటి హాని లేదు కాబట్టి నేను గోడలకు పూత పూశాను. కొంత మంది పూర్తి వివరాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. ఈ ప్రాజెక్టుకు స్టడీ ఆఫ్ హీట్ స్ట్రెస్ కంట్రోల్ బై యూజింగ్ ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ అని పేరు పెట్టారని ఆమె చెప్పారు.
Read Also: CM Chandrababu: నేడు అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
వైరల్ అవుతున్న వీడియోలో వత్సల గోడలపై ఆవు పేడ పూస్తున్నట్లు కనిపించింది. ఇక్కడ క్లాసెస్ చెప్పేవారు త్వరలో ఈ గదులను కొత్త రూంలో చూస్తారని, మీ బోధన అనుభవాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తన సందేశంలో రాశారు. సి బ్లాక్‌లోని తరగతి గదులను చల్లబరచడానికి స్వదేశీ పద్ధతులను అవలంబిస్తున్నారని పేర్కొంటూ, ఆమె కాలేజ్ గ్రూపులో తన వీడియోని పంచుకుంది. 1965లో స్థాపించబడిన ఈ కళాశాల, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు మీద స్థాపించబడింది, ఇది అశోక్ విహార్‌లో ఉంది. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.