Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కార్‌ని పేల్చేస్తామని, వర్లిలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. ఈ బెదిరింపుల్లో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు. ఈ సంఘటన తర్వాత వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ప్రస్తుతం అధికారులు ఎవరు ఈ మెసేజ్ చేశారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని హతమార్చేందుకు పలు సందర్భాల్లో రెక్కీ కూడా నిర్వహించింది. దీంతో ఆయనకు ప్రాణహాని ఉండటంతో ప్రభుత్వం ఆయన సెక్యూరిటీని కూడా పెంచింది.
Read Also: Fire Safety Week: నేటి నుండి తెలంగాణా రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు
1998లో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉందని లారెన్స్ బిష్ణోయ్ ముఠా సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసింది. బిష్ణోయ్ కమ్యూనిటీకి ఎంతో ఆరాధ్యమైన కృష్ణజింకను చంపినందుకు పగ పెంచుకున్నారు. 2024లో, సల్మాన్ ఖాన్ ఒక ఆలయాన్ని సందర్శించి, కృష్ణ జింకల హత్యకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి కొత్త బెదిరింపు వచ్చింది. అక్టోబర్ 30న, నటుడిని గుర్తు తెలియని వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తూ మళ్ళీ బెదిరించాడు.
2024లో నకిలీ గుర్తింపు కార్డు ఉపయోగించి సల్మాన్‌ఖాన్ కి చెందిన పన్వేల్ ఫామ్ హౌజ్‌లోకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడటానికి ప్రయత్నించారు. ఈ బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ అనేక సార్లు భద్రతను పెంచారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దేవుడు, అల్లా చూస్తున్నారు, విధి అనుమతించిన కాలం నా జీవితం ఉంటుంది అని అన్నారు.