Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. ఆయనను భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. పేదలను దోచుకున్న వారిని ప్రధాని నరేంద్రమోడీ వదిలిపెట్టరని అన్నారు. పేదల డబ్బులో విదేశాలకు పారిపోయిన వారు చివరకు తమ డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రమంత్రి అన్నారు.
Read Also: KTR: ఆయన ముందు చూపు వల్లే తెలంగాణ ఏర్పడింది.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
“పేదల డబ్బును దోచుకున్న వారు దానిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారు. దేశంలో చాలా మందిపై చర్యలు తీసుకుంటున్నారు. మెహుల్ చోక్సీ అరెస్టు చేయబడ్డారు. ఇది చాలా పెద్ద విజయం” అని చౌదరి మీడియాతో అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)తో సహా పలు భారతీయ ఏజెన్సీల అప్పగింత అభ్యర్థన మేరకు బెల్జియం అధికారులు చోక్సీని అరెస్ట్ చేశారు.